హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ‌కీయ అశాంతి క‌లిగిస్తున్న ల‌గ‌డ‌పాటిపై చ‌ర్య‌లు తీసుకోండి..! ఈసీ కి టీఆర్ఎస్ ఫిర్యాదు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో రాజ‌కీయ పార్టీలు గెలుపుకోసం ఎవ‌రి వ్యూహం వారు అమ‌లు చేసుకుంటుంటే మాజీ ఎంపి ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ వారి ప్ర‌య‌త్నాల‌కు గండి కొడుతున్న‌ట్టు తెలుస్తోంది. అభ్య‌ర్థుల గెలుపోట‌ములు అంటూ చిల‌క జోష్యం చెబుతూ వారి మ‌నోభావాల‌ను గాయ‌పరుస్తున్న‌ట్టు తెలంగాణ‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ల‌గ‌డ‌సాటి స‌ర్వేల‌పై టీఆర్య పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ కు ఫిర్యాదు కూడా చేసింది టీఆర్ఎస్ పార్టీ.

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి జోష్యం..! ఈసికి ఫిర్య‌దు చేసిన గులాబీ ద‌ళం..!

తెలంగాణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ల‌గ‌డ‌పాటి జోష్యం..! ఈసికి ఫిర్య‌దు చేసిన గులాబీ ద‌ళం..!

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందా అని అంద‌రూ చాలా ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ గురించి అనాల‌సిస్ చేసినా ఒక్కొక్క‌రికి ఒక్కో బ‌లం క‌నిపిస్తోంది. అయితే, తెలంగాణ‌లో పొత్తుల వ‌ల్ల‌.. ఇపుడు ఇద్ద‌రే పోటీలో ఉన్న‌ట్లు అనుకోవాలి. ఒక‌టి కాంగ్రెస్‌, రెండు టీఆర్ఎస్‌. ఇరు వ‌ర్గాల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి స‌ర్వే అయినా వ‌స్తే ఊపిరి పీల్చుకుందాం అని అటు ప్ర‌జ‌లు, ఇటు నాయ‌కులు భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ట్రైల‌ర్ లాగా త‌న స‌ర్వేలో శాంపిల్ పీస్ వ‌దిలారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఓ టీవీ ఛానెల్ చేసిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న రెండు విష‌యాలు చెప్పారు. ఒక‌టి 8 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నార‌ని, ఇంకోటి ఈసారి తెలంగాణ‌లో హంగ్ రావ‌డం లేద‌ని అన్నారు.

ల‌గ‌డ‌పాటి తెలంగాణ లో విభేదాలు స్రుష్టిస్తున్నారు..! ఆయ‌న స‌ర్వేలు అవ‌స‌రం లేదంటున్న టీఆర్ఎస్..!

ల‌గ‌డ‌పాటి తెలంగాణ లో విభేదాలు స్రుష్టిస్తున్నారు..! ఆయ‌న స‌ర్వేలు అవ‌స‌రం లేదంటున్న టీఆర్ఎస్..!

ఇపుడు రాష్ట్రమంత‌టా ల‌గ‌డ‌పాటి చెప్పిన అంశంపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణలో ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పిన ఆయన మాటను కొంద‌రు ఇలా విశ్లేషించారు. టీఆర్ఎస్ పార్టీ మొద‌టి నుంచి ఎంఐఎంను పాంప‌ర్ చేస్తోంది. వారు గుడ్డిమామ క‌న్నా మెల్ల‌క‌న్ను మామ బెట‌ర్ అని టీఆర్ఎస్‌ను అవ‌మానిస్తున్నా, టీఆర్ఎస్ మాత్రం ఆ పార్టీతో రాసుకుపూసుకు తిర‌గ‌డానికి తెగ ఆసక్తి చూపిస్తోంది. దీనికి కార‌ణం.. ఆ పార్టీ బ‌లంగా లేన‌ట్టు స‌ర్వేలు రావ‌డం వ‌ల్లే ఎంఐఎంతో బాగుంటే సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటుచేయొచ్చ‌ని కేసీఆర్ ఆశిస్తున్నార‌ని అంటున్నారు.

తెలంగాణ స‌మాజాన్ని భ‌య‌పెడుతున్న ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు..! మాకొద్దంటున్న నేత‌లు..!!

తెలంగాణ స‌మాజాన్ని భ‌య‌పెడుతున్న ల‌గ‌డ‌పాటి స‌ర్వేలు..! మాకొద్దంటున్న నేత‌లు..!!

హంగ్ రావ‌డం లేద‌ని ల‌గ‌డపాటి చెప్పారంటే, క‌చ్చితంగా కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంద‌ని ప్ర‌జాకూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకోవ‌చ్చంటున్నారు. బ‌హుశా కేసీఆర్-కేటీఆర్ మోస‌పోవ‌ద్దని ప్ర‌జ‌ల‌ను బ‌తిమాల‌డానికి కూడా కార‌ణం ఇదే అని తెలుస్తోంది. ఇటీవ‌ల క‌విత కూడా కేసీఆర్‌లాగే మాట్లాడింది. తెరాస నేత‌లు కూడా పార్టీకి ఈస‌మ‌యంలో రాజీనామాలు చేస్తున్నారంటే, ఏదో క‌చ్చిత‌మైన స‌మాచారం ఉండ‌బ‌ట్టే అని అంటున్నారు.

ఈసి చ‌ర్య‌లు తీసుకోవాలి..! ల‌గ‌డ‌పాటికి బ్రేకులు వేయాల‌ని టీఆర్ఎస్ విజ్ఞ‌ప్తి..!

ఈసి చ‌ర్య‌లు తీసుకోవాలి..! ల‌గ‌డ‌పాటికి బ్రేకులు వేయాల‌ని టీఆర్ఎస్ విజ్ఞ‌ప్తి..!

ఐతే వివిద స‌ర్వేల పేరుతో తెలంగాణ రాజకీయాల్లో ఆశాంతి నెల‌కొల్పుతున్న మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పై టీఆర్ఎస్ నేత‌లు ఈసీ కి ఫిర్యాదు చేసారు. రోజుకు ఇద్ద‌రి అభ్య‌ర్థుల గెలుపోట‌ముల‌ను వెళ్ల‌డిస్తాన‌ని భ‌హాటంగా చెప్పి ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ అతిక్ర‌మించార‌ని వారు ఆరోపిస్తున్నారు. అభ్య‌ర్థుల రాజ‌కీయ భ‌విత‌వ్యాన్ని ప్ర‌జ‌లు నిర్ధారించాలి గాని ల‌గ‌డ‌పాటి ఎవ‌ర‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ల‌గ‌డ‌పాటి చ‌ర్య‌ల వ‌ల్ల ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల మ‌నో స్త్యైర్యం దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంద‌ని వారు ఈసికి ఫిర్యాదు చేసారు. ల‌గ‌డ‌పాటి రాజ్ గోపాల్ పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేసారు.

English summary
The TRS leaders have complained to the former MP Lagadapati Rajagopal who are in the Telangana politics in the name of surveys. They blame Lagadapati Raj Gopal for violating the code of conduct by telling us that he will go to the victory of two candidates per day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X