తెలంగాణలో వర్ష బీభత్సం... నేడు,రేపు ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు...

హైదరాబాద్ ‌సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వాన జనాలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఐదు లేదా ఆరు సెం.మీ వర్షపాతానికే అల్లకల్లోలమయ్యే నగరంలో 20సెం.మీ పైబడి వర్షం కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 18 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేలా కురిసిన వర్షంతో చాలా ప్రాంతాలు చెరువులను,నదులను తలపించాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రాష్ర్ట ప్ర‌భుత్వం బుధవారం (అక్టోబర్ 13),గురువారం(అక్టోబర్ 14) అన్ని ప్రభుత్వ ,ప్రైవేట్ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది.అయితే అత్యవసర సేవల సిబ్బందికి మాత్రం సెలవులు వర్తించవు. నెగొషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం ఈ సెలవులను ప్రకటించినట్లు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. బుధ, గురువారాల్లో జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రీషెడ్యూల్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

telagnana government declared two days holidays due to heavy rain effect

మంగళవారం నాటి భారీ వర్షానికి అక్కడ,ఇక్కడ అన్న తేడా లేకుండా నగరంలో ఎక్కడ చూసినా వరదనీళ్లే కనిపించాయి. సాయంత్రం సమయంలో విధులు ముగించుకుని ఇళ్లకు బయలుదేరినవాళ్లు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి విలవిల్లాడారు. భారీ వర్షానికి రోడ్డు సరిగా కనిపించక... నీళ్లతో నిండిన రోడ్లపై ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో మరో రెండు,మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది.

భారీ వర్షాల కారణంగా అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు చెప్తున్నారు. పాత భవనాలను వెంటనే ఖాళీ చేయించి... వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని
అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా క‌లెక్ట‌ర్ల‌ు, ఎస్పీలు,విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.

కాగా,ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే 48 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 1,148.2 మి.మీ వర్షపాతం నమోదైంది. 15 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. 12 జిల్లాల్లో భారీ వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వనపర్తి జిల్లాలో సాధారణం కంటే 133శాతం ఎక్కువగా వర్షపాతం నమోదవగా... నిర్మల్‌ జిల్లాలో 13శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం.

Recommended Video

    Vishakapatnam : A Ship Drifted On To The Shore At Tenneti Park In Vizag | Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+