త్వరలో తెలంగాణా బడ్జెట్ సమావేశాలు .. ఆ ముగ్గురి చుట్టూ ఎమ్మెల్యేల ప్రదక్షిణలు

తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్యేల తిప్పలు అన్నీ ఇన్నీ కావు . రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు గతంలో ఇచ్చిన హామీలకు నిధులు రాకపోవడంతో ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ చుట్టూ అలాగే కేటీఆర్ చుట్టూ, ఆర్ధిక మంత్రి హరీష్ రావు చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు . నియోజకవర్గాల్లో సమస్యలపై ప్రజలు నిలదీస్తుంటే విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో వాళ్లు నిధుల కోసం ఆర్థిక మంత్రి హరీశ్ రావును సైతం సంప్రదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

నిధుల లేమితో తెలంగాణా ఎమ్మెల్యేల పాట్లు

నిధుల లేమితో తెలంగాణా ఎమ్మెల్యేల పాట్లు

ఇక తెలంగాణా బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపధ్యంలో నిధుల కోసం నానాపాట్లు పడుతున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అవకాశం దొరికినప్పుడల్లా నిధులు మంజూరు చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఈ సారి ఆర్ధిక మందగమన ప్రభావంతో చాలా లోటు బడ్జెట్ లో ఉన్న తెలంగాణా రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

నిన్నటిదాకా ఎలక్షన్ బిజీ

నిన్నటిదాకా ఎలక్షన్ బిజీ

నిన్నటి దాకా ఎన్నికల వంక పెట్టి తప్పించుకున్న నేతలకు ఇప్పుడు ప్రజలకు నియోజకవర్గ అభివృద్ధి పనులు చెయ్యకపోవటానికి ఏం వంకలు చెప్పాలో అర్ధం కావట్లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్నికలు రావడంతో పనులు పక్కన పెట్టి ఎన్నికలలో గడిపారు. ఎవరు ఏ పని అడిగినా ఎలెక్షన్ బిజీ అని చెప్పుకొచ్చారు .ఇక ఇప్పుడు ఒక్క జీహెచ్ ఎంసీ ఎన్నికలు తప్ప మరే ఇతర ఎన్నికలు లేకపోవటంతో నియోజకవర్గాల్లో హామీ ఇచ్చిన పనులకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.

ప్రజాగ్రహం చూడక ముందే పనులు చెయ్యాలని ప్రయత్నాలు

ప్రజాగ్రహం చూడక ముందే పనులు చెయ్యాలని ప్రయత్నాలు

ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాకముందే పనులు చక్కబెట్టాలని వారు భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలే కాకుండా గత పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక పనులపై ఫోకస్ పెడతామని అభివృద్ధి చేద్దామని భావిస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు నిధుల లేమి తీవ్ర ఇబ్బందులు పెడుతుంది. ఇక ఇదే సమయంలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు త్వరలోనే ప్రారంభమవుతుండడంతో ఎమ్మెల్యేలందరూ ఆర్థిక మంత్రి హరీశ్ రావు చుట్టూ తిరుగుతున్నారు.

 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో మంత్రి హరీష్ ను కలుస్తున్న ఎమ్మెల్యేలు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపధ్యంలో మంత్రి హరీష్ ను కలుస్తున్న ఎమ్మెల్యేలు

తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు . రోడ్లు , డ్రైనేజీ , పారిశుద్ధ్యం, తాగునీరు తదితర మౌలిక సమస్యల పరిష్కారానికి నిధులు కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులను కేటాయించేవారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించలేదు. దీంతో ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలు కాస్త టెన్షన్ పడుతున్నారు.ఇక ఈ నేపధ్యంలో అయినా ఎమ్మెల్యేలకు తెలంగాణా సర్కార్ నిధులు ఇస్తుందా ? అన్నది వేచి చూడాలి .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+