హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్‌కు చేదు అనుభవం: కారుకు అడ్డుపడ్డ యువకులు: మిడ్ మానేరు పర్యటనలో..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక వద్ద నిర్మించిన మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రయాణిస్తోన్న కారుకు కొందరు యువకులు అడ్డు పడ్డారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. పోలీసులు సకాలంలో స్పందించి వారిని పక్కకు తీసుకెళ్లడంతో కాన్వాయ్ సాగిపోయింది.

దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !దేశద్రోహులతో కేసీఆర్ మిలాఖత్: తెలంగాణ పోలీసులేమీ తక్కువ తినలేదు: ఎమ్మెల్యే రాజాసింగ్.. !

అడ్డుకున్న యువకులు..

అడ్డుకున్న యువకులు..

మిడ్ మానేరు ప్రాజెక్టు సందర్శన కోసం ఈ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయన తొలుత వేములవాడకు చేరుకున్నారు. అక్కడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మిడ్ మానేరు ప్రాజెక్టులో జలహారతి కార్యక్రమానికి హాజరు కావడానికి కొదురుపాక వైపు బయలుదేరారు. మిడ్ మానేరు సమీప గ్రామానికి చేరుకున్న కాన్వాయ్.. ఓ వీధి గుండా వెళ్తున్న సమయంలో పక్కనే నిల్చున్న కొందరు యువకులు అడ్డుపడ్డారు.

కేసీఆర్ కారుకు అడ్డుగా నిల్చుని, ప్లకార్డుల ప్రదర్శన..

కేసీఆర్ కారుకు అడ్డుగా నిల్చుని, ప్లకార్డుల ప్రదర్శన..

చేతుల్లో ప్లకార్డులను ప్రదర్శిస్తూ కారుకు అడ్డుగా నిల్చున్నారు. తొలుత- పైలెట్, భద్రతా సిబ్బంది కారును వెళ్లనిచ్చారు. ఆ వెంటనే కేసీఆర్ కూర్చున్న కారు రాగానే.. దానికి అడ్డుగా నిల్చున్నారు. అయినప్పటికీ..డ్రైవర్ కారు వేగాన్ని నియంత్రించారే గాన్నీ దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. యువకులు కారుకు అడ్డుగా నిల్చుని ప్లకార్డులను ప్రదర్శిస్తూ రోడ్డుకు అడ్డుగా నిల్చున్నప్పటికీ.. వారిని దాటుకుని వెళ్లే ప్రయత్నం చేశారు.

పరిహారం కోసమే..

పరిహారం కోసమే..


అనూహ్యంగా యువకులు కేసీఆర్ కారుకు అడ్డు పడ్డ దృశ్యాన్ని చూసిన వెంటనే అక్కడే విధి నిర్వహణలో ఉన్న ఓ కానిస్టేబుల్ వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లారు. దీనితో కాన్వాయ్ సాఫీగా సాగిపోయింది. ఆ యువకులు ఎవరనేది తెలియ రావాల్సి ఉంది. మిడ్ మానేరు ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారిగా చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో పరిహారం అందలేదనే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కేసీఆర్ కారుకు అడ్డు పడ్డారని తెలుస్తోంది.

జలహారతిలో..

జలహారతిలో..

కాగా.. మిడ్‌ మానేరు ప్రాజెక్టును సందర్శించి అక్కడ జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ అక్కడి నుంచి కరీంనగర్ కు బయలుదేరి వెళ్లారు. కరీంనగర్ శివార్లలోని తీగలగుట్టపల్లిలో తెలంగాణ భవన్‌ కు చేరుకోవాల్సి ఉంది. అనంతరం ఆయన హైదరాబాాద్ కు బయలుదేరి వెళ్తారు.

English summary
Telangana Chief Minister K Chandra Sekhar Rao convoy and his car was stopped by farmers at Mid Maneru in Vemulavada. KCR tour in Rajanna-Sircilla district on Monday as the dam had reached its full reservoir level of 25.875 tmc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X