తెలంగాణలో ఒక్కసారిగా భారీగా తగ్గిన కరోనా కేసులు: వెయ్యికి దిగువగా: కోలుకున్న 2 లక్షలమంది

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా తగ్గుముఖం పట్టింది. మరణాల సంఖ్య కూడా సగానికి సగం తగ్గింది. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గిపోవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. వెయ్యికి దిగువగా రోజువారీ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి కేసులతో పోల్చుకుంటే..రోజువారీ సంఖ్య సగానికి తగ్గినట్టే. అదే సమయంలో కరోనా బారి నుంచి కోలుకుంటోన్న వారి సంఖ్యలో రెండువేల వరకు నమోదవుతోంది. ఫలితంగా- రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 948 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నలుగురు మరణించారు. 1,896 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,23,059కి చేరుకుంది. ఇందులో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,00,686గా నమోదైంది. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 1275కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు 21,098గా నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 17,,432 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

 Telangana: Newly 948 Covid19 positive cases and 4 deaths reported in Telangana last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజువారీ కేసుల్లో పెద్దగా మార్పు కనిపించట్లేదు. కొత్తగా 212 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్-9, భద్రాద్రి కొత్తగూడెం-56, జగిత్యాల-22, జనగామ-11, జయశంకర్ భూపాలపల్లి-7, జోగుళాంబ గద్వాల-9, కామారెడ్డి-4, కరీంనగర్-63, ఖమ్మం-25, మహబూబ్ నగర్-11, మహబూబాబాద్-15, మంచిర్యాల-9, మెదక్-6, మేడ్చల్ మల్కాజ్‌గిరి-65, ములుగు-14, నాగర్ కర్నూలు-11, నల్లగొండ-35, నారాయణపేట్-2, నిర్మల్-5, నిజామాబాద్-29, పెద్దపల్లి-14, రాజన్న సిరిసిల్ల-9, రంగారెడ్డి-98, సంగారెడ్డి-42, సిద్ధిపేట్-54, సూర్యాపేట్-28, వికారాబాాద్-5, వనపర్తి-11, వరంగల్ రూరల్-11, వరంగల్ అర్బన్-46, యాదాద్రి భువనగిరి-10 కేసులు నమోదు అయ్యాయి. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు సగానికి పడిపోయాయి. 24 గంటల్లో కొత్తగా 26,027 కరోనా టెస్టింగులు నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 38,56,530కి చేరుకుంది. ప్రతి 10 లక్షల మందికీ 1,03,614 టెస్టులను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

Recommended Video

    Telangana Floods Losses Estimated at Rs 5,000 Crore ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడిన హైదరాబాద్

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+