తెలంగాణ ఆన్‌లైన్ తరగతులపై మార్గదర్శకాలు విడుదల: ఏ తరగతికి ఎన్నిగంటలంటే..?

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విద్యాశాఖకు అనుమతివ్వడంతో విద్యాశాఖ ఇందుకు సంబంధించిన చర్యలు చేపట్టింది. తాజాగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.

సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు

సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు

డిజిటల్ తరగతులకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన కోరారు. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. జూన్ 1 నుంచి ప్రైవేటు విద్యాసంస్తలు డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నాయి.

విద్యార్థులకు తలనొప్పిగా మారిన ప్రైవేటు పాఠశాలల క్లాసులు..

విద్యార్థులకు తలనొప్పిగా మారిన ప్రైవేటు పాఠశాలల క్లాసులు..


కొన్ని ప్రైవేటు పాఠశాలలు గంటల తరబడి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్తులకు కంటి సమస్యలతోపాటు ఆరోగ్య సంబంధ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు అనుసరించాల్సిన విధి విధానాలను విద్యా శాఖ ప్రకటించింది.

నర్సరీ నుంచి యూకేజీ వరకు 45 నిమిషాలే..

నర్సరీ నుంచి యూకేజీ వరకు 45 నిమిషాలే..

గతంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యథాతథంగా పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. నర్సరీ నుంచి యూకేజీ వరకు రోజుకు 45 నిమిషాలు మాత్రమే ఆన్‌లైన్ కాస్లులు నిర్వహించాలని పాఠశాల విద్య సంచాలకులు దేవసేన తాజా ఉత్తర్వులో స్పష్టం చేశారు. వారంలో మూడు రోజులు మాత్రమే వారికి తరగతులు ఉండాలని నిర్దేశించారు.

Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu
    ఏ తరగతుల వారికి ఎన్ని గంటలంటే..

    ఏ తరగతుల వారికి ఎన్ని గంటలంటే..

    1 నుంచి 12 తరగతుల వరకు వారానికి 5 రోజులు డిజిటల్ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు గరిష్టంగా గంటన్నర, 6 నుంచి 8 తరగతుల వారికి రోజుకు గరిష్టంగా 2 గంటలు, 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు గరిష్టంగా 3 గంటలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీశాట్, తెలంగాణ దూరదర్శన్ ద్వారా తరగతులు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల డీఈవోలు, పాఠశాల ప్రాధానోపాధ్యాయులు ఈ తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+