ఆఫర్ ఎక్స్‌డెంట్: చలాన్ల వసూల్‌కు మరో 15 రోజుల గడువు
చలాన్లకు వాహనదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజుల గడువు పొడిగించింది. భారీ రాయితీతో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని గత నెలలో కీలక ప్రకటన చేసిన పోలీసు శాఖ.. ఈ నెల 1 నుంచి 31 వరకు స్పెషల్ డ్రైవ్‌ను ప్రకటించింది. ఊహించినట్టుగానే వాహనదారుల నుంచి చలాన్ల క్లియరెన్స్‌కు మంచి స్పందనే లభించింది. బుధవారం నాటికి ఏకంగా రూ.250 కోట్ల మేర పోలీసు శాఖకు ఆదాయం సమకూరింది.

మరో రోజులోనే పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పథకం ముగియనుండగా.. ఇంకా చాలా మంది వాహనదారులు తమ చలాన్లను క్లియర్ చేసుకోలేదు. క్లియరెన్స్ గడువు పొడిగింపు ఉండదని మంగళవారం నాడు ప్రకటించిన పోలీసు శాఖ.. బుధవారం నాటికే తన విధానాన్ని మార్చుకుంది. వాహనదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌ను మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు బుధవారం రాత్రి ప్రకటించింది. ఈ ప్రకటన ప్రకారం చలాన్ల క్లియరెన్స్ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది.
ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం, తోపుడు బండ్లకు 75 శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది. గత రెండు సంవత్సరాలు కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనం ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది.
వాహనదారులు ఎలాంటి పడిగాపులు, క్యూలైన్లు, అవసరం లేకుండా తమ జరిమానాలను ఈ-చలానాల వెబ్‌సైట్ https://echallan.tspolice.gov.in/publicviewలో పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేలా పోలీసు శాఖ పోర్టల్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ అప్ డేట్ సాఫ్ట్ వేర్ మార్చి1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. దానిని పొడగిస్తారు.












Click it and Unblock the Notifications