జాతీయ పంచాయతీ అవార్డుల్లో సత్తా చాటిన తెలంగాణ: ఏకంగా 8 అవార్డులు
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. 2023 సంవత్సరం దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 27 అవార్డులు ప్రకటిస్తే వీటిలో ఏకంగా ఎనిమిది అవార్డులు రాష్ట్రానికి దక్కడం గమనార్హం.
జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో ప్రకటించిన మొదటి తొమ్మిది కేటగిరీల్లో.. నాలుగు కేటగిరీల్లో తెలంగాణనే మొదటి స్థానం దక్కించుకోవడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్ హెల్తీ పంచాయతీ కేటగిరీలోమొదటి స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా నెల్లుట్ల వాటర్ సఫిషియెంట్ పంచాయతీ విభాగంలో తొలి స్థానం దక్కించుకుంది.

మహబూబ్‌నగర్ జిల్లా కొంగట్‌పల్లి సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ విభాగంలో మొదటి స్థానం సాధించింది. సూర్యపేట జిల్లా ఐపూర్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు, జోగులాంబ గద్వాల జిల్లా మాన్ దొడ్డి పావర్టీ ఫ్రీ విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. వికారాబాద్ జిల్లా చీమల్ దర్రి పంచాయతీ గుడ్ గవర్నెన్స్ విభాగంలో రెండో స్థానంలో నిలిచింది.
పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీగా మూడో స్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్‌ఫ్రా విభాగంలో మూడోస్థానం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కేటగిరీల్లో శుక్రవారం ప్రకటించిన మొత్తం 27 అవార్డుల్లో ఎనిమిది రాష్ట్రానికి రావడం విశేషం. ప్రత్యేక కేటగిరీ విభాగంలో సోమవారం మరిన్ని అవార్డులను ప్రకటించే అవకాశం ఉండటంతో.. వీటిలో కూడా తెలంగాణకు అవార్డులు వచ్చే అవకాశంఉంది.
Telangana shines yet again ✊
— KTR (@KTRBRS) April 7, 2023
Best performer in National Panchayat Awards
✅ Highest Rise in Per Capita
✅ Best Gram Panchayats
✅ 100% ODF + Villages as per Govt of India
All credit to Visionary CM KCR Garu and his brainchild “Palle Pragathi” which has uplifted the villages… pic.twitter.com/Esc38P7zwA
జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలు సాధించిన ఘనతపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం.. ఉత్తమ గ్రామ పంచాయతీలు.. వందశాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలు అన్నీ తెలంగాణలోనే ఉన్నాయన్నారు. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అద్భుతమైన పనితీరు కనబర్చినట్లు తెలిపారు. కేసీఆర్ మానసపుత్రిక పల్లెప్రగతితో గ్రామాల రూపురేకలు మారుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన












Click it and Unblock the Notifications