Severe Rainfall Alert: తెలంగాణలో 5 రోజులు వర్ష బీభత్సమే..! హైదరాబాద్‌లో కూడా...!
తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగనుంది. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు వర్షం కురవనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సమృద్దిగా వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల ఆల్ మోస్ట్ నిండిపోయాయి. మరో ఐదు రోజుల వరకు వర్ష ప్రభావం ఉండటంతో పంటలకు మరింత మేలు జరగనుంది.
Recommended Video

5 రోజులు వర్ష బీభత్సమే..
గత కొద్దిరోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అంటే 6 రోజులుభారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం మరీ ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలపై పడే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో కూడా సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని వివరించింది.

ఉరుములు, మెరుపులు...
రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. 20, 21వ తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి జల్లులు, మోస్తారు వర్షాలు కురుస్తాయి. 22వ తేదీ కూడా మోస్తారు వర్షాలు ఉంటాయి. 23వ తేదీ మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి. 24వ తేదీలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. 25వ తేదీ వాతావరణం పొడిగా ఉండి.. తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఈ 5 రోజులు గ్రేటర్ ఉత్తర ప్రాంతంలో వర్షపాతమే ఎక్కువే కురుస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని ఆయా శాఖలను అప్రమత్తం చేసింది.

అత్యధిక వర్షపాతం నమోదు
గత నెల 1 నుంచి 19వ తేదీ వరకు 258.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 409.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 178 శాతం వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడగా, వికారాబాద్ జిల్లా బొంరాసిపేట మండలం దుడ్యాలలో గరిష్ఠంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
ఈ సారి ఎక్కువ
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువే నమోదు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్ష బీభత్సం ఇలానే కొనసాగితే.. ప్రాజెక్టులు గరిష్ట నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. పంటలకు వానాకాలం, యాసంగి పంటలకు నీరు సమృద్ధిగా లభించే పరిస్థితులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications