కరోనా వారియర్స్ కు జేజేలు .. గాంధీ వైద్య సిబ్బందిపై రేపు హెలికాఫ్టర్ ల ద్వారా పూల వర్షం
హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ తో బాధ పడుతున్న వారి ప్రాణాలు కాపాడుకోవటానికి వ్యాప్తిని అరికట్టటానికి ప్రయత్నం చేస్తున్నారు.తమ కుటుంబాలకు దూరంగా కరోనా బాధితులకు సేవలు చేస్తున్న వైద్య సిబ్బందికి కాస్త ఉత్సాహాన్ని , బూస్ట్ ను ఇవ్వటంతో పాటు వారికి వారు చేస్తున్న సేవలకు జేజేలు పలుకుతున్నారు ప్రజలు .
Recommended Video
ఇక ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై పూల వర్షం కురవనుంది. కరోనా కట్టడిలో వైద్యుల , పోలీసుల పాత్ర ఎనలేనిది. కరోనా వ్యాధి నియంత్రణలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న కృషికి దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తం అవుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే కరోనా వారియర్స్ కు కృతజ్ఞతలు తెలపడానికి భారత త్రివిధ దళాలు సిద్ధమయ్యాయి. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై ఆదివారం నాడు మే 3 వ తేదీన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు పూలవర్షం కురిపించనున్నాయి.

ఈ మేరకు డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ బిపిన్ రావత్ ఇటీవల చెప్పిన వివరాల మేరకు కరోనా వారియర్స్‌కు ఘనంగా జేజేలు పలుకుతూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది చేస్తున్న కృషికి గుర్తింపుగా , వారి సేవలకు సపోర్ట్ గా ఉదయం 9.30గంటలకు ఐఏఎఫ్ హెలికాఫ్టర్ల ద్వారా అధికారులు పూలవర్షం కురిపించనున్నారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications