Numaish 2023: నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహణపై నీలినీడలు.. ఇంకా రాని అనుమతులు..!
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచే ఎగ్జిబిషన్(నుమాయిష్)కు సరిగ్గా 85 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్ గార్డెన్స్‌లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్.. నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్‌గా ఆవతరించింది. నాడు కొంత మంది విద్యావంతుల ఆలోచన నేడు వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

80 స్టాల్స్
80 స్టాల్స్‌తో ప్రారంభమైన నుమాయిష్..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం వరకు చేరుకుంది. ఈ నుమాయిష్ ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగుతోంది. అయితే నుమాయిష్ 2023 జనవరిలో హైదరాబాద్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (ఏఐఈ) సొసైటీకి ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి రాలేదు.

GHMC
TNIEలో ప్రచురించన ఒక నివేదిక ప్రకారం, సొసైటీకి అగ్నిమాపక శాఖ నుంచి ఎటువంటి అభ్యంతర లేఖలు రాలేదు. అంతేకాకుండా R&B, GHMC, అనేక ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. మరో 2-3 రోజుల్లో అనుమతి కోసం ఎగ్జిబిషన్ సొసైటీ భావిస్తోంది. తాజాగా, హైదరాబాద్‌లో నుమాయిష్ ప్రవేశ ధరను రూ.10కి పెంచుతున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. పెద్దలకు రూ. 40 కాగా.. ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం.

2021
నగరంలోని నుమాయిష్ వద్ద సందర్శకుల సౌకర్యార్థం వీల్ చైర్ సౌకర్యాలు, వాహనానికి అనుకూలమైన వాక్‌వే అందుబాటులో ఉంచుతారు.
మహమ్మారి కారణంగా 2021 నుమాయిష్ నిర్వహించలేదు. 2023లో జనవరి 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ భారత్ లో కేసుల సంఖ్య నియంత్రణలో ఉన్నందున ఎగ్జిబిషన్ జరుగుతుందని సొసైటీ ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications