హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏమీ దొంగరా నాయనా.. సీపీ మాట్లాడుతుండగా అడ్డగింపు, లోపలికి తీసుకెళ్లి

|
Google Oneindia TeluguNews

పోలీసు అధికారులు ప్రెస్ మీట్ సమయంలో దొంగలు/ నేరస్తులు హుషారుతనం చేస్తున్నారు. అందరూ కాదులెండి.. ఒక కేటుగాడు.. ఏకంగా సీపీతోనే వాదించాడు. అవును మీడియా సమావేశంలో.. వాదనకు దిగాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు ఈ పరిస్థితి ఎదురయ్యింది. దీంతో అతనిని వెంటనే పోలీసులు లోపలికి తీసుకెళ్లారు.

దొంగతనాలు..

దొంగతనాలు..


కర్నూలు జిల్లా కండేలికి చెందిన చెందిన గుంజపాగు సుధాకర్‌ అలియాస్‌ సాయి అలియాస్‌ ఆంధోనీ, అలియాస్‌ కాకా, అలియాస్‌ డేంజర్‌ బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. మెహిదీపట్నంలో ఉంటూ ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆ డబ్బులు సరిపోక.. దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. అలా జైలుకు వెళ్లిన సమయంలో చేవెళ్లకు చెందిన మరో ఘరానా దొంగ మహ్మద్‌ ఆయూబ్‌ అలియాస్‌ బడా ఆయూబ్‌తో పరిచయం అయింది. ఆయూబ్‌ అప్పటికే 120 దొంగతనాలు చేసిన ఘనుడు. ఇద్దరూ ఈ ఏడాది అక్టోబర్‌-13న జైలు నుంచి విడుదలయ్యారు.

70 తులాల బంగారం..

70 తులాల బంగారం..

అక్టోబర్‌ 21వ తేదీన అర్ధరాత్రి 2:00గంటలకు గగన్‌మహల్‌ స్వామి నిలయం అపార్ట్‌మెంట్‌ పక్కింటి గోడ దూకి చొరబడ్డారు. 70 తులాల బంగారం చోరీచేశారు. అల్మారాలో మరో బ్యాగులో ఉంచిన 30 తులాల బంగారాన్ని చూడకపోవడంతో ..దాన్ని అలా వదిలేసి వెళ్లారు. చోరీ సొత్తును సుధాకర్‌ తన భార్య నాగమణి అలియాస్‌ నాగవేణి అలియాస్‌ బుజ్జి అలియాస్‌ చిట్టితల్లికి ఇచ్చాడు. ఆమె కొంత సొత్తును ముంబైకి చెందిన మహ్మద్‌ తబ్రేజ్‌దౌడ్‌ షేక్‌ సహకారంతో అమ్మేసి సొమ్ముచేసుకుంది. దాంతో పోలీసులు ఇద్దరు దొంగలు సుధాకర్‌, ఆయూబ్‌తో పాటు.. సుధాకర్‌ భార్యని కూడా అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.

పీడీ యాక్ట్

పీడీ యాక్ట్


ఇప్పటికే 59 దొంగతనాలు చేశాడు.. రెండు సార్లు పోలీసులు పీడీయాక్టు నమోదు చేశారు.. అయినా బుద్ధి మార్చుకోలేదు. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన 8 రోజులకే 70 తులాల బంగారం చోరీ చేశాడు. పోలీసులు సదరు ఘరానా దొంగ అతని భార్యతోపాటు మరో దొంగను అరెస్టు చేశారు. వారి నుంచి 41 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్‌, జాయింట్‌ సీపీ విశ్వప్రసాద్‌తో కలిసి మీడియాకు వివరాలు తెలియజేశారు.

సీపీ మాట్లాడుతుండగా.. అడ్డగింపు

సీపీ మాట్లాడుతుండగా.. అడ్డగింపు

చోరీ జరిగిన తీరుతోపాటు నిందితుల వివరాలు వెల్లడిస్తుండగా పక్కనే అదుపులో ఉన్న నిందితుడు సుధాకర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దొంగతనం చేసింది తను.. అని.. తన భార్య పేరు ఎందుకు తెస్తున్నారు. ఆమెను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు. దొంగతనంతో ఆమెకు ఏం సంబంధం అని గట్టిగా అరిచాడు. దీంతో పోలీసులు అతన్ని పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లారు. పాపకు ఫిట్స్‌ ఉంది. ఏమైనా అయితే ఎవరు చూసుకోవాలని పోలీసులతో వాదించినట్లు తెలిసింది. కానీ సీపీ మాట్లాడుతుండగా.. వాదనకు దిగాడు. ఇదీ కాస్త సంచలనంగా మారింది.

English summary
thief Conflict to cp anjani kumar at press meet. he disturb to cp for not tell his wife name in the robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X