Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Chain Snatching: హయత్‍నగర్‍లో చైన్ స్నాచింగ్.. అవాక్కైన దొంగలు..!

చైన్ స్నాచర్లకు ఓ మహిళ షాక్ ఇచ్చింది. తన మెడలోంచి లాక్కెళ్లిన గొలుసు..!

హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నెల క్రితం రెండు కమిషనరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్‌కు పాల్పడ్డారు. గత నెల 7న ఉప్పల్, నాచారం సహా అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు గొలుసు దొంగతనాలు చేసి 21 తులాల బంగారం అపహరించారు. అప్పటి నుంచి పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. తాజాగా హయత్‌నగర్‌లో చైన్‌ స్నాచర్లు రెచ్చిపోయారు.

ఒంటరి మహిళలు

ఒంటరి మహిళలు

నిర్మానుష్యంగా ఉన్న కాలనీల్లోని షాపుల్లో ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్ లకు తెగపడుతున్నారు.ఈనెల 25న దుకాణంలో ఉన్న మహిళను కత్తితో బెదిరించి గొలుసు లాక్కెళ్లారు. తాజాగా షాపులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన ఘటన సోమవారం జరిగింది. హయత్‌నగర్‌కు చెందిన మేక సునీత ఆదిత్యనగర్‌ కాలనీలో కిరాణ షాపు నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బైక్‌పై దుకాణానికి వచ్చారు.

సిగరెట్‌ కావాలని

సిగరెట్‌ కావాలని

బైకు వెనుక కూర్చొన్న హెల్మెట్‌ ధరించిన వ్యక్తి షాపులోకి వెళ్లి సిగరెట్‌ కావాలని అడిగాడు. సిగరెట్‌ తీసి ఇస్తుండగా ఆమె మెడపై కత్తి పెట్టి.. బెదిరించి గొలుసు లాక్కొని పారిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే దొంగులు లాక్కెళ్లిన గొలుసు రోల్డ్ గోల్డని బాధితురాలు చెప్పింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గోకుల్ నగర్ బస్తీ

గోకుల్ నగర్ బస్తీ

మరో ఘటనలో గోకుల్ నగర్ బస్తీలో విజయ్ కుమారి అనే మహిళ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి చైన్ స్నాచింగ్‎కు పాల్పపడ్డాడు ఓ దుండగుడు. మహిళపై దాడికి పాల్పడి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. బంగారం వేసుకుని ఒంటరిగా బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.

చిక్కిన దొంగ

చిక్కిన దొంగ

గత నెలలో వరుస చైన్ స్నాచింగ్ పాల్పడిన నిందితులను పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బవారియా గ్యాంగ్‌ చైన్ స్నాచింగ్ లు చేసినట్లు సమాచారం. నిందితుల్లో ఒకరైన మంగళ్‌ను రాచకొండ పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు.ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఉన్‌ మండలానికి చెందినదే ఈ బవారియా గ్యాంగ్‌. ఆ మండలంలోని పలు హామ్లెట్స్‌లో నివసించే పలు ముఠాలు దేశ వ్యాప్తంగా చైన్‌ స్నాచింగ్స్‌ సహా అనేక నేరాలు చేస్తుంటాయి. పంకజ్‌ అలియాస్‌ పింకు నేతృత్వంలో మంగళ్, దీపక్‌ అలియాస్‌ సెహ్వాగ్, సేవజ్‌ అలియాస్‌ లక్ష్మణ్‌ సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో వరుస స్నాచింగ్స్‌ చేసిన తర్వాత రైలులో గత నెల 7న నగరానికి చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+