హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం - ముగ్గురు సజీవ దహనం..!!
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రాణాలు తీస్తున్నాయి. కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టింబర్ డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు పక్కనే ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న దంపతులు సహా ఒక బాబు సజీవదహనమయ్యారు. కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుషాయిగూడ పోచమ్మ టెంపుల్ వద్ద ఉన్న టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. మృతులను నల్లగొండ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్ (35), సుమ (28), జోషిత్ (8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఒక చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భారీగా మంటలు ఎగిసిపడడంతో టింబర్ డిపో పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
సమాచారం అందుకున్న వెంటనే కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటల్లో మృతిచెందిన ముగ్గురు మృతదేహాలను బయటకు వెలికి తీశారు. చిన్నారి ఆచూకీ తెలియడంలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాలుగు షాపులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. ఇంకా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేసవి కావటంతో అగ్ని ప్రమాదాల పైన జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications