హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తోడేళ్ళ దాడిని తప్పించుకోడానికి ఈటల ఢిల్లీ వెళ్లారన్న దాసోజు శ్రవణ్.!మోదీ గ్రాఫ్ పడిపోయిందన్న పొన్నాల.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో పాటు ప్రధాని మోదీ ఏడేళ్ల పాలనపై కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, పొన్నాల లక్ష్మయ్య ఘాటుగా స్పందించారు. తోడేళ్ళ దాడిని తప్పించుకోడానికి ఈటెల ఢిల్లీకి వెళ్ళారని, ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు, పోలీస్, రెవెన్యూ అధికారులతో ఈటల రాజేందర్ మీద ఒత్తిడి పెంచారని, దాన్ని తప్పించుకోడానికి ఈటెల ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. చంద్రవేఖర్ రావు ఆధిపత్యం కోసం ఈటల తోపాటు ఆయన భార్య జామున, కొడుకు, కోడలు పై కేసులు పెడుతున్నారని శ్రవణ్ సంచలన వాఖ్యలు చేసారు.

టిఎస్పిఎస్సీలో అంతా గందరగోళమే.. కొత్త చైర్మన్ నిరుద్యోగులను ఆదుకోవాలన్న దాసోజు శ్రవణ్..

టిఎస్పిఎస్సీలో అంతా గందరగోళమే.. కొత్త చైర్మన్ నిరుద్యోగులను ఆదుకోవాలన్న దాసోజు శ్రవణ్..

అంతే కాకుండా గాంధీ భవన్ లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సెలక్ట్ ఐన అభ్యర్థులతో దాసోజు శ్రవణ్ భేటీ అయ్యారు. టిఎస్పిఎస్సీ చేసిన తప్పిదాలకు నిరుద్యోగ యువత బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 2017 నవంబర్ లో స్టాఫ్ నర్సుల నియామకాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిందని, కానీ.. ఆ ఫలితాలు ప్రకటించడంలో టిఎస్పిఎస్సీ నిర్లక్ష్యం చేస్తుందని, దాదాపు 3311 మంది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు గాను 26 వేల 412 మంది అప్లికేషన్ పెట్టుకున్నారని శ్రవణ్ తెలిపారు. అందులో 21,319 మంది పరీక్షకు హాజరయ్యారని, ఐతే కేవలం 2418 మందికి అపాయింట్ మెంట్ ఇచ్చారని, ఇంకా 893 మంది జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని శ్రవణ్ మండిపడ్డారు.

నిరుద్యోగులకు జీవితాల మీద విరక్తి కలుగుతోంది.. వెంటనే ఉద్యోగాల భర్తి చేయాలన్న దాసోజు..

నిరుద్యోగులకు జీవితాల మీద విరక్తి కలుగుతోంది.. వెంటనే ఉద్యోగాల భర్తి చేయాలన్న దాసోజు..

ఈ మధ్యనే కొత్తగా టీఎస్పీఎస్సీ కమిటీ ఏర్పాటైందని, ఛైర్మన్ జనార్దన్ రెడ్డి హయాంలోనైన సక్రమంగా ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నామని శ్రవణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. బిశ్వాల్ కమిటీ చెప్పినట్లుగా లక్ష 90వేలు, అదనంగా మరో రెండు లక్షల ఉద్యోగాలు నింపవచ్చని అన్నారు.నిరుద్యోగ యువత పట్ల సర్కార్ కుట్ర చేస్తోందని, 34 ఏళ్లు దాటొద్దని వ్యవసాయ నోటిఫికేషన్ లో వేశారని, దీన్నే అన్ని నోటిఫికేషన్ లకు అమలయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. నిరుద్యోగులకు 44 ఏళ్ళ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వాలని కోరుతున్నామని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి యువత సర్వం కోల్పోయిందని, గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయక 10ఏళ్లు దాటిందని, నోటిఫికేషన్ లకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేయాలని శ్రవణ్ డిమాండ్ చేసారు.

మోడి గ్రాఫ్ పడిపోయింది.. ప్రపంచ దేశాల ముందు మోదీ నవ్వుల పాలయ్యారన్న పొన్నాల

ఇదిలా ఉండగా నేటితో మోడి పాలన ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని, ఆరు సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే గత సంవత్సరం పాలన ఒక ఎత్తని, మోడీ పాలన పేదలకు శాపంగా పరిణమించిందని, ప్రపంచంలో మోడీ నవ్వుల పాలయ్యార పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు.ప్రజలని ఏడిపించే నాయకుడు మోడి తాను ఏడుస్తున్నట్లు నటిస్తున్నారని, కరోనా కట్టడిలో చేతులు ఎత్తేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆక్షిజన్, మందుల కొరతకు కారణం ప్రధాని ముందస్తు వ్యూహం లేకపోవడం కారణం కాదా అని పొన్నాల ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేసి అమ్మేస్తున్నారని, 2004 నుండి 2014 ఆర్థిక వృద్ధి రేటు ఎలా ఉంది.. 2014 నుండి ఇప్పటివరకు ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని సూచించారు. ఏడేళ్ల పాలన చూసుకుంటే మోడి గ్రాఫ్ పడిపోయిందన్నారు పొన్నాల.

Recommended Video

Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
కరోనా బాదితులకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.. అదిష్టానం పిసీసీ ఇస్తే తీసుకోవడానికి రెడీ అన్న విహెచ్

కరోనా బాదితులకు కేసీఆర్ ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి.. అదిష్టానం పిసీసీ ఇస్తే తీసుకోవడానికి రెడీ అన్న విహెచ్

రాష్ట్రంలో కరోనా తో చనిపోయిన వారి కుటుంబాలకు ఎస్గ్రేషియా, వారి పిల్లలకి చదువు చెప్పించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రైతులకి రైతు బందు ఇచ్చి రైతు బంధువు ఐనట్టే కరోనా బాదితులకు అండగా ఉండాలని సీఎం చంద్రశేఖర్ రావు ను కోరారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలని ఎందుకు వ్యతిరేకించడం లేదని చంద్రశేఖర్ రావును సూటిగా ప్రశ్నించారు వీహెచ్. కరోనా బాదితులకు ఇతర రాష్ట్రాలు ఇచ్చినట్లు రెండు లక్షల ఎస్గ్రేషియా ఇవ్వాలని సూచించారు. లెఫ్ట్ భావజాలం కలిగిన ఈటల బీజేపీలో చేరుతుండటం ఆశ్చర్యం కలిగించిందని, బడుగు బలహీన వర్గాల వారికి పీసీసీ ఇవ్వాలని, హైకాండ్ పీసీసీ ఇస్తే పగ్గాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నానని వీహెచ్ తెలిపారు.

English summary
Congress leaders Dasoju Shravan and Ponnala Lakshmaiah reacted sharply to the political developments taking place in Telangana and Prime Minister Modi's seven-year rule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X