శ్రీరాముడి శోభయాత్ర: సిటీలో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

హైదరాబాద్: శ్రీరామ నవమి వేడుకలు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే శోభయాత్రకు ఇప్పటికే ఏర్పట్లన్నీ పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లో అంటే గురువారం ఒంటి గంటకు శ్రీరాముడి శోభయాత్ర ప్రారంభం కానుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆధ్వర్యంలో ఈ శోభయాత్ర జరగనుంది.

శోభయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో శోభయాత్ర మార్గంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీరాముని శోభయాత్ర మొత్తం ఆరు కిలోమీటర్ల మేర సాగుతుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారి మళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రధానంగా గోషామహల్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు.

Traffic restrictions in Hyderabad due to Sri Rama Navami Shobha Yatra

గురువారం మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కానున్న ఈ శోభయాత్ర సీతారామ్ బాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యాయామశాల వరకు సాగనుంది. బోయగూడ కమాన్, మంగళ్జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాఫూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ ఛత్రి, బర్తన్ బజార్, సిద్ధంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ కోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుల్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయమశాలకు యాత్ర చేరుకోనుంది.

గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మల్లేపల్లి చౌరస్తా, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బోయిగూడ కమాన్, గౌలిపుర చౌరస్తా, ఘోడేకి ఖబర్, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పురానాపూల్ ఎక్స్‌రోడ్, ఎంజే బ్రిడ్జ్, లేబర్ అడ్డా, సాయంత్ర 5 నుంచి 6 గంటల వరకు అలస్కా టీ జంక్షన్, ఎస్ఏ బజార్ యూ టర్న్, ఎంజే మార్కెట్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అఫ్జల్‌‌గంజ్ జంక్షన్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సాయంత్రం 5 నుంచి రాత్రి 7 వరకు రంగమహల్ టీ జంక్షన్, పుల్లిబౌలి చౌరస్తా, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆంధ్రా బ్యాంక్ ఎక్స్‌రోడ్, డీఎం అండ్ హెచ్ఎస్ రోడ్స్, సుల్తాన్ బజార్ చౌరస్తా, చాదర్ ఘాట్ చౌరస్తా, రాత్రి 7 నుంచి 9 వరకు కాచిగూడ ఐనాక్స్, జీపీఓ అబిడ్స్, రాత్రి 7 నుంచి 10 గంటల వరకు బొగ్గులకుంట చౌరస్తాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా, శోభయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. యాత్రను సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+