ప్రచారంలో బిజీబిజీ.. మూడు జిల్లాల పర్యటనకు కేసీఆర్
హైదరాబాద్ : మలివిడత ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రోజుకు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొంటున్నారు. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల ప్రచారానికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 11 గంటల 15 నిమిషాలకు నిర్మల్ జిల్లా ఖానాపూర్ శివారులోని విద్యానగర్ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.30 - 1.00 ప్రాంతంలో ఇచ్చోడలో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు.

అక్కడినుంచి నిర్మల్ కు వెళ్లి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎల్లపెల్లి క్రషర్ రోడ్డులో జరగనున్న సభలో పాల్గొంటారు. అనంతరం 3 గంటల ప్రాంతంలో భైంసా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఆర్మూర్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభకు హాజరవుతారు. ఇక్కడి సభ ఏర్పాట్లను టీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 50వేల మందిని సభకు తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications