మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు జోరు ..పరకాల,చెన్నూరు,మరిపెడ మున్సిపాలిటీలు కైవసం
Recommended Video
తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. కౌంటింగ్ కొనసాగుతుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆదిలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తుంది . కారు రాయిన దూసుకుపోతుంది . టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
పరకాల, చెన్నూరు, మరిపెడ మున్సిపాలిటీలలో గులాబీల హవా
మున్సిపాలిటీ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆరంభంలోనే బోణీ కొట్టింది. పరకాల, చెన్నూరు, మరిపెడ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. చెన్నూరులో మొత్తం 18 వార్డులను దక్కించుకుంది. పరకాలలో మొత్తం 22 వార్డులు కైవసం చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 15 డివిజన్ లలో టీఆర్ఎస్ విజయం సాధించి మరిపెడ మున్సిపాలిటీ దక్కించుకుంది.

కొనసాగుతున్న కౌంటింగ్ .. లీడ్ లో టీఆర్ఎస్
పలు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. నేడు ఉదయం 8 గంటలకు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 134 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు ప్రతి వార్డుకు రెండు టేబుట్స్‌ను ఏర్పాటు చేశారు.ఇక పూర్తిగా మధ్యాహ్నంలోపు ఫలితాలు వెలువడనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. తర్వాత బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పార్టీల వారిగా విభజించి లెక్కిస్తున్నారు.

నిజామాబాద్ ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం
120 మున్సిపాలిటీలు.. 9 కార్పొరేషన్లలో 12వేల 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.వారందరి రాజకీయ భవితవ్యం నేడు తేలిపోనుంది. 60 వార్డులు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఫలితాలు కాస్త ఆలస్యంగా వెలువడే అవకాశముంది. అటు కౌంటింగ్ సెంటర్ల దగ్గర ఘర్షణలకు తావు లేకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఫలితాలు వెలువడే వరకు కౌంటింగ్ సెంటర్ల దగ్గర 144 సెక్షన్ విధించారు.రాష్ట్రం లోని అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.

రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ.. ధీమాలో టీఆర్ఎస్
ఈ ఎన్నికలు ఎమ్మెల్యేల పని తీరు, సమర్థతకు పరీక్ష కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు తమ పరిధిలో విజయం సాధిస్తామన్న ధీమాలో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఎమ్మెల్యేలకు సైతం కీలకంగా మారటంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ నెలకొంది . అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది . ఇక అన్ని పార్టీల్లోనూ ఎన్నికల గెలుపోటములు పార్టీలో వారి ప్రాధాన్యతను నిర్దేశించడంతోపాటు భవిష్యత్తులో పదవులు పొందడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయన్న నేపధ్యంలో అన్ని పార్టీల కీలక నాయకులు ఫలితాలపై దృష్టి సారించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications