హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TSRTC STRIKE:24 గంటల దీక్ష షురూ.. విలీనమే ప్రదానం... కేసీఆర్, మంత్రుల కామెంట్లపై గుస్సా

|
Google Oneindia TeluguNews

ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతల ఒకరోజు దీక్ష మధ్యాహ్నం ప్రారంభమైంది. గురువారం 1 గంట నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దీక్ష కొనసాగుతుంది. సకల జనుల సమరభేరీ సభలో ఆర్టీసీ కార్యాచరణను ప్రకటిస్తూ ఇవాళ దీక్ష చేపడుతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 97 బస్సు డిపోల వద్ద ఆర్టీసీ కార్మికుల దీక్ష చేపట్టారు. కార్మికులపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

సమ్మె @27

సమ్మె @27

ఆర్టీసీ కార్మికుల సమ్మె 27వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికుల ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. రోజుకో విధంగా తమ నిరసనను తెలియజేస్తున్నారు. గురువారం డిపోల ముందు దీక్ష చేపట్టారు. 24 గంటలపాటు దీక్ష చేపట్టారు. తమ 26 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని కార్మికులు పట్టుబడుతున్నారు. అద్దె బస్సులు తీసుకొస్తామని చెప్పి బెదిరించడం తగదని పేర్కొన్నారు.

సంఘీభావం

సంఘీభావం

ఆర్టీసీ జేఏసీ నేతల దీక్షలకు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. మద్దతు ప్రకటించి.. అండగా ఉంటామని భరోసానిచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఐఆర్, పీఆర్ పెంచాలని పట్టుబపడుతున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తీర్చేవరకు సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా

ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామని కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. సకల జనుల సమ్మె ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పుడేమో మీడియాలో వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి.. కించపరిచేలా కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్టీసీ డిమాండ్లు నెరవేరాయోనని కొందరు ఉద్యోగుల గుండె ఆగిపోతుందని గుర్తుచేశారు.

వీరి వల్లే..?

వీరి వల్లే..?

న్యాయమైన హక్కుల కోసం ఆందోళన బాట పడితే తమ సమస్యలను తీర్చేందుకు కృషిచేయకపోవడం దారుణమన్నారు. ఉద్యోగులమా ? లేదా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ మనోధైర్యం కోల్పోయేందుకు ప్రభుత్వ వైఖరి కారణమని పేర్కొన్నారు. రోజులు గడుస్తోన్న సమస్య పరిష్కారంపై దృష్టిసారించలేదని తెలిపారు. ఇటీవల మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ మీడియా సమావేశం కార్మికుల మరింత కుంగదీసిందన్నారు. వారి మాటలతోనే కార్మికులు ఆత్మహత్య బాట పడుతున్నారని గుర్తుచేశారు.

English summary
tsrtc jac hunger strike starts at 97 bus depots.political parties are support to jac hunger strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X