సికింద్రాబాద్ వెళ్లకుండా చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు ఇవే

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. దూర ప్రయాణాల నుంచి వచ్చే రైళ్లకు సిగ్నల్ రాకపోవడంతో సిటీ బయటే ఎదురుచూడాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ లో కేవలం 10 ప్లాట్ ఫారాలు ఉండటమే దీనికి కారణం. ఇక్కడి నుంచి ప్రతిరోజు 200 రైళ్ల ద్వారా 1.86 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు కొన్ని రైళ్లను చర్లపల్లి నుంచి నడపబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ రూ.430 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావచ్చాయి.

చర్లపల్లికి అనుంధానంగా వేసిన ఎంఎంటీఎస్ రైల్వేలైను మౌలాలి-సనత్ నగర్ పూర్తయింది. ఈ మార్గంలో గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన వెంటనే ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా ఈ మార్గంలో నడవనున్నాయి. లింగపల్లి నుంచి సనత్ నగర్, మౌలాలి మీదగా చర్లపల్లికి చేరుకుంటాయి. ప్రస్తుతం ఇక్కడ గోల్కొండ, శాతవాహన, కృష్ణా, ఇంటర్ సిటీ రైళ్లకు హాల్టింగ్ ఉంది. పనులు పూర్తవగానే 25 రైళ్లను ఇక్కడి నుంచి నడిపించబోతున్నారు.

twenty five trains will run from cherlapally railway terminal in a few days

ముంబయి-భువనేశ్వర్ కోణార్క్, మచిలీపట్నం-షిరిడీ వీక్లీ ఎక్స్ ప్రెస్, కాకినాడ-షిరిడీ ట్రైవీక్లీ, బీదర్-మచిలీపట్నం సూపర్ ఫాస్ట్, కాకినాడ-లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్, కాజీపేట-పూణె ట్రైవీక్లీ, లింగంపల్లి-కాకినాడ కోకనాడ ట్రైవీక్లీ, టాటానగర్-యశ్వంత్ పూర్ వీక్లీ, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్, హైదరాబాద్-చెన్నై రైళ్లు చర్లపల్లి నుంచి నడవనున్నాయి. జమ్ముతావి-తిరుపతి హమ్‌సఫర్‌ వీక్లీ, గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌, నిజాముద్దీన్‌ - బెంగళూరు సిటీ రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రాగానే నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని సికింద్రాబాద్ డివిజన్ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+