చైన్ స్నాచింగ్: సిటీలో రెండు కేసులు నమోదు.. కూతవేటు దూరంలో..
చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపించి.. వారిలో మెడలో హారం ఉంటే చాలు.. క్షణాల్లో దోచేసి.. మాయం అవుతున్నారు. ఇవాళ గ్రేటర్ పరిధిలో రెండు కేసులు వచ్చాయి. సికింద్రాబాద్ నార్త్‌జోన్ పోలీసు సర్కిల్ పరిధిలో ఒకే రోజు రెండు చైన్ స్నాచింగ్ జరిగాయి. మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో విజయ అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగార గొలుసు తీసుకొని పరారీ కాగా, దానికి ఒక కిలోమీటర్ దూరంలోనే తూకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంబాయి అనే మరో మహిళ మెడలో నుండి మూడున్నర తులాల చైన్ ను దుండగులు తెంచుకుపోయారు.
మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సంజీవయ్య కాలానికి చెందిన విజయ తమ ఇంటికి అరకిలోమీటర్ దూరంలో ఉన్న ప్రైవేట్ హస్ఫటల్ కి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వెనుకవైపు నుండి పల్సర్ వాహనంపై వచ్చిన దుండగుడు మెడలోని చైన్ లాక్కొని పారిపోయాడు. ఉదయం 10 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని బాధితురాలు తెలిపింది.

మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మరొ ఘటన జరిగింది. ఉదయం గొలుసు తెంపుకు పోయిన స్ధలానికి కిలోమీటర్ దూరంలో తుకారాం గేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రాంబాయి అనే మరో మహిళ మెడలోంచి మూడున్నర తులాల బంగారం గొలుసు లాక్కొని పారిపోయాడు. బాధితులిద్దరూ పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనా స్ధలాలకు చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు. రెండో ఘటనల్లో చోరీకి వాడిన వాహనం యాక్టివాగా గుర్తించారు. వెహికల్ నంబర్‌ను కూడా సీసీ టీవీ ఫుటేజీలో గుర్తించినట్టు సమాచారం. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications