Hyderabad: ఉద్యోగ సంఘాల సంబురాలు.. ఎందుకంటే..!
ప్రభుత్వం హెల్త్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో హెల్త్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

ముజీబ్
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుంచి ఒక శాతం, మిగిలిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ట్రస్ట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ తో చర్చించి పరిష్కరిస్తామన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులు
ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరణ చేస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. సెర్ఫ్ ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నామని కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈహెచ్ఎస్ విధానం
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని తెస్తామన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములుగా వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని హరీశ్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications