హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేవంత్ రెడ్డి జైలుకెళితే.. కాంగ్రెస్ పరిస్థితేంటి?: వైఎస్‌ను తిట్టినా బెదిరింపులు రాలేదన్న వీహెచ్, పీసీసీ చీఫ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనేది ఇప్పుడు ఆ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే కీలక పదవులు కట్టబెడతారా? అని మండిపడుతున్నారు సీనియర్ నేతలు. తాజాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు(వీహెచ్) సంచలన వ్యాఖ్యలు చేశారు.

రేవంత్ రెడ్డిపై వీహెచ్ తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డిపై వీహెచ్ తీవ్ర విమర్శలు

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినవారికంటే ఇతర పార్టీల నుంచి వచ్చినవారి పెత్తనమే ఎక్కువైపోయిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని నాశనం చేసి.. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పీసీసీ చీఫ్ ఇస్తా అంటే ఎలా? అని వీహెచ్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి జైలుకెళితే.. కాంగ్రెస్ కూడా జైలు చుట్టూ తిరగాలా?

రేవంత్ రెడ్డి జైలుకెళితే.. కాంగ్రెస్ కూడా జైలు చుట్టూ తిరగాలా?

రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయని.. అలాంటి వ్యక్తికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా.. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి జైలుకు పోతే.. పార్టీ కూడా జైలు చుట్టూ తిరగాలా? అని వీహెచ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటి వరకు తనను తిట్టినవాళ్లు లేరని, మూడు నాలుగు పార్టీలు తిరిగినవాళ్లు తిడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఆరోపణలున్నాయంటే.. కొందరు ఫోన్లు చేసి బూతులు తిడుతున్నారని వీహెచ్ తెలిపారు. ఒక్క జానారెడ్డి ఒక్కరే దీన్ని ఖండించారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క అసలు స్పందించలేదని అన్నారు.

టీడీపీ కాంగ్రెస్సా.. వైఎస్‌ను తిట్టినా బెదిరింపులు రాలేదన్న వీహెచ్..

టీడీపీ కాంగ్రెస్సా.. వైఎస్‌ను తిట్టినా బెదిరింపులు రాలేదన్న వీహెచ్..

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినా తమకు కడప నుంచి బెదిరింపులు రాలేదని వీహెచ్ చెప్పారు. రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడైతే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. అంతేగాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంతమందిని గెలిపించారు? అని ప్రశ్నించారు. పీసీసీ అయితే టీడీపీ కాంగ్రెస్ చేస్తావా? అని రేవంత్‌ను నిలదీశారు. జూనియర్లు, సీనియర్లు కలిసి పనిచేస్తేనే పార్టీ అని చురకలంటించారు.

పీసీసీ చీఫ్ కోమటిరెడ్డి ఐతే ఓకే.. రేవంత్ అయితే అంతే సంగతులు

పీసీసీ చీఫ్ కోమటిరెడ్డి ఐతే ఓకే.. రేవంత్ అయితే అంతే సంగతులు

పీసీసీ చీఫ్ పదవి బీసీలకు ఇవ్వాలని లేదంటే.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తనకు సొంత పార్టీలోనే రక్షణ లేదని, ఎప్పుడు ఎవరు దాడి చేస్తారోనని భయంగా ఉందన్నారు. రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ఏమీ కాకముందే తమకు ఇంత ఇబ్బందిగా ఉంటే.. పార్టీ ప్రెసిడెంట్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గాంధీ భవన్‌కు ఎవరినీ రానియ్యరని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కేసీఆర్ కోవర్టులు ఉన్నారని అన్నారు. ఎవరెన్ని తిట్టినా తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు.

English summary
V Hanumantha Rao hits out at Revanth Reddy on TPCC president issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X