ఇక వ్యాక్సినేషన్ వ్యాన్లు.. ఇక్కడ మాత్రమే అందుబాటులో..
కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రజలందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని నిపుణులు స్పష్టం చేశారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరం చేశాయి. ప్రజలందరికి టీకాలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత స్పీడప్ చేసింది. మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు తీసుకొచ్చింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లను వైద్యారోగ్య శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు పనిచేస్తాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తంగా 100 మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వైద్యారోగ్య శాఖ చేపట్టనుంది. వ్యాక్సినేషన్ వ్యాన్ల కోసం 040-2111 11111 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications