తెలంగాణలో వంగవీటి మోహన రంగా భారీ విగ్రహం: రాధ ఏమన్నారంటే?
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న వంగ వీటి మోహన రంగాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. ఎమ్మెల్యేగా ఒక్కసారే గెలిచినప్పటికీ.. ఆయన పేరు మాత్రం రాజకీయాల్లో ఇప్పటికీ చెరగని ముద్ర వేస్తూనే ఉంది. ఏపీతోపాటు తెలంగాణలోనూ అభిమానులు ఉండటంతో రంగాకు ఇక్కడ భారీ విగ్రహం ఏర్పాటు చేశారు.
#vangaveetiranga #thotachandrashekhar #vangaveetimohanaranga #vangaveeti #vijayawada #chadrashekhar #tcrwithkcr pic.twitter.com/acC5lHmzDy
— Dr. Thota Chandra Shekhar, I.A.S(Rtd) (@DrTCShekhar) July 8, 2023
హైదరాబాద్ నగరంలో రంగా పది అడుగుల భఆరీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాజులరామారంలో ఏర్పాటు చేసిన వంగవీటి రంగా 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆయన తనయుడు, మాజీ మంత్రి వంగవీటి రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు హాజరవడం గమనార్హం.

కుత్బూల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సహా పలువురు నేతలు, రంగా మిత్రమండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో రంగా విగ్రహం ఏర్పాటు ఎంతో ఆనందన్నించిందని.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి రంగా అని వంగవీటి రాధా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినా అభిమానానికి అడ్డుకట్ట లేదని తెలంగాణవాసులు నిరూపించారన్నారని అన్నారు.
వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డా॥ తోట చంద్రశేఖర్ I.A.S.(Rtd)
— Dr. Thota Chandra Shekhar, I.A.S(Rtd) (@DrTCShekhar) July 9, 2023
- రంగ హత్య పై వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలి#vangaveetiranga #thotachandrashekhar #vangaveetimohanaranga #chadrashekhar #tcrwithkcr pic.twitter.com/8z5JiZkFy2
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 1989లో వంగవీటి రంగా ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి అని.. ఆయనను కుట్రతో 1988లో హత్య చేశారని తోట చంద్రశేఖర్ అన్నారు. మూడున్నర దశాబ్దాలు గడిచినా రంగాను హత్య చేసిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.
పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తూ.. మళ్లీ కాపులను మోసం చేసి వాళ్ల ఓట్ల కోసం గాలం వేస్తున్నారంటూ తోట చంద్రశేఖర్ ఆరోపించారు. రంగా హత్య కేసును రీఓపెన్ చేయాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రంగా హంతకులకు సరైన శిక్ష పడినప్పుడే రంగా ఇచ్చే ఘన నివాళని తోట వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పాల్గొన్న నేతలు రంగా సేవలను కొనియాడారు. కాగా, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రంగా పేరు కేంద్ర బిందువుగా మారుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications