మెగా ఫ్యామిలీకి కరోనా ఫియర్ .. వరుణ్ తేజ్ కు పాజిటివ్ .. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయా ?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ ,సినీ ప్రముఖులు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ కూడా కరోనా దెబ్బకు క్వారంటైన్ అవుతోంది. ఈరోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని మెగా హీరో రామ్ చరణ్ వెల్లడించగా, తాజాగా మరో మెగా హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది .

 వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ .. హోం క్వారంటైన్ లో మెగా హీరో

వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ .. హోం క్వారంటైన్ లో మెగా హీరో

తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడుతున్నా అని పేర్కొన్నారు. తనతో టచ్ లో ఉన్న వాళ్ళందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని సెల్ఫ్ క్వారంటైన్ అవ్వాలని వరుణ్ తేజ్ సూచించారు. అయితే క్రిస్మస్ సందర్భంగా జరిగిన వేడుకలు మెగా ఫ్యామిలీ కరోనా బారిన పడటానికి కారణమని తెలుస్తుంది.

రాం చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మెగా ఫ్యామిలీ

రాం చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మెగా ఫ్యామిలీ

ఈనెల 25వ తేదీన రామ్ చరణ్ తన ఇంటికి మెగా ఫ్యామిలీ ని ఆహ్వానించారు. రాం చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు . క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు వేడుకల్లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్ కు సన్నిహితంగా అందరూ కలిసి ఫొటోలు దిగారు. రామ్ చరణ్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ ,వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు బాబీ, కళ్యాణ్ దేవ్, స్నేహ రెడ్డి , చైతన్య జొన్నలగడ్డ ,నిహారిక ,సుష్మిత ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు.

ఇప్పటికి ఇద్దరికీ పాజిటివ్ ... మిగతా మెగా ఫ్యామిలీకి టెన్షన్

ఇప్పటికి ఇద్దరికీ పాజిటివ్ ... మిగతా మెగా ఫ్యామిలీకి టెన్షన్

ఈ క్రిస్మస్ వేడుకలే వీరికి కరోనా వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ లో ఇద్దరు రామ్ చరణ్, వరుణ్ తేజ్ తమకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. రామ్ చరణ్ తనకు ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ క్వారంటైన్ అయ్యారని, జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించారు . స్వల్ప లక్షణాలతో పాజిటివ్ అని తేలిందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు. మెగా కుటుంబంలో వీరిద్దరికీ ప్రస్తుతం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో, మిగతా వారందరూ ఇప్పుడు కరోనా టెన్షన్ లో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+