దళితులకు నయవంచన.. విజయశాంతి విసుర్లు
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళితబంధు పథకానికి బ్రేకులు పడడంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. ఇదంతా కేసీఆర్ పనేనని ఆమె ఆరోపించారు. లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయించి, ఆపై డ్రా చేసుకోకుండా వెంటనే ఫ్రీజ్ చేయించారని వివరించారు. ఆ విధంగా ఎన్నికల కోడ్ కారణంగా దళితబంధు నిలిచిపోయే వరకు తీసుకొచ్చారని తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు దళితబంధును ఈసీతో నిలిపివేయించి, ఈటల రాజేందర్ పేరుతో దొంగలేఖను సృష్టించారని, ఇదంతా టీఆర్ఎస్ కుట్రేనని పేర్కొన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇలాగే చేస్తే ప్రజలు ఊహించని సంఖ్యలో బీజేపీ ప్రజాప్రతినిధులను జీహెచ్ఎంసీకి పంపించారని, ఇప్పుడు హుజూరాబాద్ లోనూ అధికార పార్టీకి అలాంటి ఫలితమే ఎదురవుతుందని స్పష్టం చేశారు. గత ఏడేళ్లలో దళితులకు మిగిలింది కన్నీరేనని, కేసీఆర్ అధికార పీఠం ఎక్కేముందుగా మోసం చేసింది దళితులనేనని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడేనని అన్నారని, ఆ విధంగా దళిత సామాజిక వర్గాన్ని పావుగా వాడుకున్నారని విమర్శించారు.
ఇటు 10 రోజుల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగనుంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం నిలిపివేసింది. బీజేపీనే కారణమని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇటు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. కానీ ఈసీ దళితబంధు పథకానికి బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే విమర్శలు- కౌంటర్ అటాక్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications