కరోనా మృతుడి అంత్యక్రియలు: మానవత్వం చాటుకున్న ‘జమాతే ఇస్లామీ హింద్’ సభ్యులు
హైదరాబాద్: కరోనా మహమ్మారి వచ్చిన నాటి నుంచి అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కరోనా మరణించినవారి అంత్యక్రియలను నిర్వహించేందుకు సొంత కుటుంబసభ్యులు కూడా వెనుకాడుతున్నారు. చనిపోయినవారిని ఆస్పత్రుల్లోనే వదిలేస్తున్నారు. మరికొందరైతే కరోనా సోకినవారిని దూరంగా పెడుతున్నారు.
కరోనా కష్టకాలంలో వికారాబాద్ జమాతే ఇస్లామీ హింద్ విభాగం సభ్యులు తమ మానవత్వం చాటుకున్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కోతగడి గ్రామంలో కరోనాతో చనిపోయిన పట్లోళ్ళ బల్వంత్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. జమాతే ఇస్లామీ హింద్ వికారాబాద్ అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, మానవ సేవ సెక్రటరీ రఫీ ఉద్దీన్, అలీ, అబ్దుల్ రహీమ్ ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 97,236 నమూనాలను పరీక్షించగా కొత్తగా 3,527 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,71,044కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 19 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3226కి చేరింది.

గత 24 గంటల్లో 3982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,30,025కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 37,793 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు వివరాలను తెలంగాణ వైద్యశాఖ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.49 కోట్లకుకుపైగా నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.81 శాతం ఉంది. మరణాల రేటు 0.56శాతంగా ఉంది.
Recommended Video
ఇక తెలంగాణ జిల్లాలవారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 18, భద్రాద్రికొత్తగూడెంలో 154, జీహెచ్ఎంసీలో 519, జగిత్యాలలో 55, జనగాంలో 31, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 48, జోగులాంబగద్వాలలో 54, కామారెడ్డిలో 20, కరీంనగర్‌లో 178, ఖమ్మంలో 215, కొమురంభీంఅసిఫాబాద్‌లో 23, మహబూబ్ నగర్ 124, మహబూబాబాద్ లో 119, మంచిర్యాల్ 88, మెదక్ 40, మేడ్చల్ మల్కాజిగిరి 188, ములుగులో 46 కరోనా కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో 81, నల్గొండలో 218, నారాయణపేట్ 26, నిర్మల్‌లో 15, నిజామాబాద్‌లో 47, పెద్దపల్లిలో 144, రాజన్నసిరిసిల్లలో 78, రంగారెడ్డిలో 207, సంగారెడ్డిలో 75, సిద్దిపేటలో 115, సూర్యపేటలో 152, వికారాబాద్‌లో 83, వనపర్తిలో 95, వరంగల్ రూరల్‌లో 96, వరంగల్ అర్బన్ లో 1130, యాదాద్రిభువనగిరి జిల్లాలో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications