Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ పబ్ లలో ఆగని అశ్లీలనృత్యాలు; క్లబ్ మస్తీ పబ్ పై దాడుల్లో 9మందిడ్యాన్సర్లు అరెస్ట్!!

తెలంగాణ రాష్ట్రంలో పబ్ ల వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గత కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పబ్ లపై దాడులు నిర్వహిస్తున్నా పబ్ లలో అశ్లీల దందా మాత్రం కొనసాగుతూనే ఉంది. పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నా పబ్ ల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. సమయానికి మించి పబ్ లను నడపడం, పబ్ లలో అశ్లీల నృత్యాలు చేయడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.

పబ్ లలో కస్టమర్లను ఆకట్టుకోవడానికి అశ్లీల నృత్యాలతో గబ్బు లేపుతున్న పబ్ ల యాజమాన్యాలు నిత్యం అర్ధరాత్రులు అశ్లీల నృత్యాలను చేయిస్తూనే ఉన్నారు. కొద్దిరోజులుగా పోలీసులు పబ్ లపై ఫోకస్ చేయడంతో పబ్ లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల టకీలా పబ్ తో ప్రారంభమైన రగడ, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్న టకీలా పబ్, నిన్న బసేరా పబ్, ఇక తాజాగా క్లబ్ మస్తీ పబ్ లో అశ్లీల నృత్యాల వ్యవహారం బయటకు వచ్చింది.

 vulgar dances in Hyderabad pubs; 9 dancers arrested in attack on Club Masti Pub

వరుసగా పబ్ లపై దాడులు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నా ఎలాంటి భయం లేకుండా నిమ్మకునీరెత్తినట్లు అశ్లీల దందాకు తెరతీసిన క్లబ్ మస్తీ పబ్ వ్యవహారం పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్బీ మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అనంతరం పోలీసులు పరిమితికి మించి డిజె సౌండ్ తో నడుపుతున్న క్లబ్ మస్తీ పబ్ పై జరిపిన దాడులలో యువతులతో అర్థనగ్న నృత్యాలు చేయిస్తున్నారని వెల్లడించారు.

ఇక ఈ దాడులలో తొమ్మిది మంది డాన్స్ చేస్తున్న యువతులను, పబ్ నిర్వాహకులను అరెస్టు చేశామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఇక నిందితులను కెపిహెచ్బి పోలీసులకు అప్పగించామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న క్లబ్ మస్తీ పబ్ ఓనర్ శివ ప్రసాద్ రెడ్డి తదితరుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+