Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..!
పటాన్‌చెరు వాల్వ్ జోన్‌లో మంజీర ఫేజ్-1 కింద తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పైపులైన్ జంక్షన్ పనుల కారణంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. నిర్వహణ పనుల కారణంగా బీహెచ్‌ఈఎల్ టౌన్‌షిప్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా, పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనగూడ, హఫీజ్‌పేట్, డోయెన్స్ కాలనీ, ఎస్‌బీఐ ట్రైనింగ్ సెంటర్లలో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది.
పైపు లైన్ రిపేర్ చేస్తున్న కారణంగా ప్రజలు సహకరించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) శనివారం తెలిపింది. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆ సమయంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది. నెల క్రితం కృష్ణా తాగునీటి సరఫరా పథకంలో భాగంగా కొండాపూర్ పంప్ హౌస్‌లోని రెండో పంపు ఎన్‌ఆర్‌వి వాల్వ్‌కు అత్యవసర మరమ్మతులు చేశారు.

దీంతో జూన్ 26,, జూన్ 27న హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మేకలమండి, భోలక్‌పూర్, చిలకలగూడ, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వే, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్ నగర్, వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి కాలనీ, మహేంద్ర హిల్స్, ఎలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ, బుద్వేల్, శాస్త్రి పేట, బద్వేల్, శాస్త్రిపేటలో నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగర్ శివారు ప్రజలు మొన్నటి వరకు నీటి కష్టాలు ఎదుర్కొన్నారు. అయితే వర్షకాలంలో వర్షాలు కురవడంతో నీటి కష్టాలు తప్పాయి.












Click it and Unblock the Notifications