KTR: విజయ్ ముద్దారు, కేటీఆర్ కు మధ్య సంబంధం ఏమిటి..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల జన్వాడ ఫామ్ హోస్ లో రేవ్ పార్టీ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పార్టీలో పాల్గొన్న 21 మంది పురుషులు, 14 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని నిర్ణయించారు. కానీ అక్కడున్న మహిళలు పోలీసులపై బుతులు తిట్టారు. శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారు.

విజయ్ ముద్దారు అనే వ్యక్తి శాంపిల్స్ ఇవ్వడానికి పోలీసులను తీవ్రంగా సతాయించాడు. దాదాపు మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పల పెట్టారు. తనకు మూత్రం రావడం లేదని ఇబ్బంది పెట్టారు. పోలీసులు ఎట్టకేలకు విజయ్ నుంచి శాంపిల్స్ సేకరించారు. డ్రగ్స్ టెస్ట్ అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మెకిలా పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు పెట్టారు. విజయ్ ముద్దారు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేత అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలపై కూడా రెండు కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో అనుమతి లేని 10.లీటర్ల ఫారిన్ లిక్కర్(7 బాటిళ్లు)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

What is the relationship between Vijay Muddaru who is accused in the cases and KTR

డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా తేలిన విజయ్ ముద్దారు గతంలో కేటీఆర్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు వ్యాఖ్యలతో ఆందోళన చెందిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డ్రగ్స్ కేసు తల నొప్పిగా మారింది. డ్రగ్స్ లో ఎవరున్నా విడిచిపెట్టొద్దని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. జన్వాడ ఫామ్ కేసులో ఎవరి వదలిపెట్టబోమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఫామ్ హౌస్ లోని సీసీ కెమెరా దృశ్యాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని ఆయన కోరారు.

కాగా జన్వాడ ఫామ్ హౌస్ ను సీజ్ చేసే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై వారు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వరకు ఫామ్ హౌస్ సీజ్ చేయాలని భావిస్తున్నారు. కాగా.. ఈ కేసులో రాజకీయ ప్రముఖల పిల్లలను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఫామ్ హౌస్ సీసీ కెమెరా ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+