Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నెక్లెస్ రోడ్‌లో ఏమి జరుగుతోంది? అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించిన యువకుడిని చంపేశారు !

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. అక్కడ ప్రేమ జంటల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒక ప్రేమ జంట అసభ్య ప్రవర్తన చూడలేక ఇదేంటి అని ప్రశ్నించినందుకు ఒక యువకుడిని చావ చితక్కొట్టాడు ఓ ప్రేమికుడు. గాయాలపాలైన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బహిరంగంగా రోడ్ పై అమ్మాయితో చేసే చెత్తపని ప్రశ్నించినందుకే ప్రాణాలు పోయేలా కొట్టిన ఘటన సభ్య సమాజాన్ని ఎటు ప్రయాణిస్తున్నాం అని ప్రశ్నిస్తోంది.

బహిరంగంగా ప్రేమజంట చేస్తున్న పాడుపని ప్రశ్నించటమే నేరం ..

బహిరంగంగా ప్రేమజంట చేస్తున్న పాడుపని ప్రశ్నించటమే నేరం ..

రెండు రోజుల క్రితం నెక్లెస్ రోడ్ లో ప్రేమ జంట దాడిలో గాయాలపాలైన యువకుడు సాయి సాగర్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో బంధువులు ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం నెక్లెస్ రోడ్ లో ఓ ప్రేమ జంట అసభ్యంగా ప్రవర్తించింది. నడి రోడ్ మీద వారు చేస్తున్న చేష్టలను చూసిన కొందరు యువకులు వారికి అడ్డుచెప్పారు. దీంతో మాకే అడ్డు చెప్తారా అంటూ ప్రేమికుడు రెచ్చిపోయాడు. ఇష్టంవచ్చినట్టు సాయి సాగర్ అనే యువకుడ్ని పిడి గుద్దులు గుద్దాడు .

పెళ్ళయ్యి పది రోజులే .. ప్రేమజంట అసభ్య ప్రవర్తన ప్రశ్నించి బలైన సాయి సాగర్

పెళ్ళయ్యి పది రోజులే .. ప్రేమజంట అసభ్య ప్రవర్తన ప్రశ్నించి బలైన సాయి సాగర్

ప్రేమికుడి దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచాడు . చనిపోయిన సాయి సాగర్ కు 10 రోజుల క్రితమే పెళ్లి అయ్యింది.ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కోసం సాయి సాగర్ నెక్లెస్ రోడ్ కి వెళ్లాడు. అనుకోకుండా అక్కడ ప్రేమజంట అసభ్య ప్రవర్తను ప్రశ్నించడం అతడి పాలిట శాపమైంది. అతని ప్రాణాలను బలిగొంది. ఓ నవవధువుకు కన్నీరు మిగిల్చింది .సాయి మృతితో ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయి మృతి కారణం అయిన క్రిమినల్ కి హైదరాబాద్ లో పోలీసులు సహకరిస్తున్నారని సాయి ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు . ఉస్మానియా ఆస్పత్రి ముందు అతన్ని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు. సాయి మృతితో అతని ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, భార్య కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ముబీన్ ను కఠినంగా శిక్షించాలని సాయి బంధువులు, ఫ్రెండ్స్ పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

సాయి సాగర్ ను పిడిగుద్దులు గుద్దిన ముబీన్ నేరచరిత్ర ఉన్నవాడు

సాయి సాగర్ ను పిడిగుద్దులు గుద్దిన ముబీన్ నేరచరిత్ర ఉన్నవాడు

యువకుడి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి ని చనిపోయేలా కొట్టిన ప్రేమికుడు ముబీన్ ను రాంగోపాల్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. సాయి సాగర్ పై దాడికి పాల్పడిన ముబీన్ కు నేర చరిత్ర ఉంది . అతను ఓ క్రిమినల్ అని, అతడిపై ఇప్పటికే 16 కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ముబీన్ పై మిర్యాలగూడలో కూడా చాలా కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు . అతడిపై పీడీ యాక్ట్ కూడా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+