పంజాగుట్ట సెంటర్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళ..
కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుండగా.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట సెంటర్ లో దారుణం జరిగింది. జరిగింది. మంగళవారం సాయంత్రం అందరూ చూస్తుండగా ఓ మహిళ.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకుంది.
సరిగ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందే మహిళ ఆత్మాహుతికి ప్రయత్నించడం కలకలం రేపింది. కాలిపోతున్న మహిళలను గుర్తించిన వెంటనే పోలీసులు బ్లాంకెట్ కప్పి, నీళ్లు చల్లి మంటల్ని ఆర్పేశారు. కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తరలించారు.

కాగా, ఆత్మాహుతికి ప్రయత్నించిన ఆ మహిళ వివరాల్ని పోలీసులు వెల్లడించాల్సిఉంది. ఆమె కేసు నిమిత్తం వచ్చిన వ్యక్తా, ఎవరా అనేది తెలియాల్సి ఉంది. మహిళ వివరాల్ని సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆమెకు సంబంధించినవాళ్లెవరో కనిపెట్టేపనిలో ఉన్నామని పోలీసులు చెప్పారు.
రద్దీగా ఉండే రోడ్డు పక్కనే ఉండటంతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. అయినాసరే మహిళ పెట్రోల్ తో లోనికి వెళ్లే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఏడాది కిందట సిటీలోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ ముందు కూడా సరిగ్గా ఇలాగే ఓ మహిళ ఆత్మాహుతికి ప్రయత్నించగా పోలీసులు కాపాడారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications