అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం - అరెస్ట్ : మద్దతుగా సునీత- విజయమ్మ..!!
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దీక్షను అర్ద్రరాత్రి పోలీసులు భగ్నం చేసారు. అరెస్ట్ చేసి ఆస్పత్రికి తరలించారు. తన పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవటాన్ని నిరిసిస్తూ రెండు రోజులుగా షర్మిల లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేసారు. అయితే, షర్మిల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించారు.

హైదరాబాద్ ఘటనతో షర్మిల..
కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లాలో షర్మిల పాదయాత్ర చేస్తన్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో వివాదం మొదలైంది. షర్మిల ను పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తరువాత షర్మిల టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేసిన తన కారులోలే సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ ప్రగతిభవన్ కు బయల్దేరారు.
మధ్యలోనే అడ్డుకున్న పోటీసులు షర్మిల కూర్చొని ఉన్న కారును తాళ్లతో తాగుతూ తీసుకెళ్లారు. దీని పైన రాజకీయంగా షర్మిలకు పలువురు సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మోదీ సైతం స్పందించారు. జరిగిన ఘటనను ఖండించారు. ఢిల్లీ రావాలని ఆహ్వానించారు.

అరెస్ట్ లోటస్ పాండ్ లో దీక్ష
ఇక, తన పాదయాత్ర కొనసాగింపుకు ప్రయత్నిస్తున్న వేళ..వరంగల్ పోలీసులు షర్మిలకు నోటీసు ఇచ్చారు. పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో, షర్మిల హైదరాబాద్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ కు తరించారు. అక్కడే దీక్ష ప్రారంభించారు.
రెండు రోజులు వరుసగా వైద్యులు పరీక్షలు చేసారు. ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుడంటతో అర్ద్రరాత్రి బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేసి అపోలోకు తరలించారు. ప్రస్తుతం అపోలోలో షర్మిలకు చికిత్స అందిస్తున్నారు. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చినా ప్రభుత్వం అనుమతివ్వటం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు.

అర్ద్రరాత్రి భగ్నం ..ఆస్పత్రిలో చికిత్స
అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను ఇంకా విడుదల చేయలేదని చెప్పారు. పార్టీ కార్యాలయం వద్ద ఆంక్షలు పెట్టి సామాన్యులను కూడా రానీయటం లేదని సీరియస్ అయ్యారు. పాదయాత్రలో ఎమ్మెల్యే అవినీతి - అక్రమాలను ప్రశ్నించినందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను ఎక్కడా ఎవరి పైనా వ్యక్తిగత దూషణలు చేయలేదని చెప్పుకొచ్చారు.
తాను ఇప్పటికే తెలంగాణలో 3500 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేసానని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేసారు. షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ దీక్షలో పాల్గొన్నారు. వైఎస్సార్ సోదరుడు సుధీకర్ రెడ్డి, వివేకానందరెడ్డి కుమార్తు సునీత షర్మిలను పరామర్శించారు.












Click it and Unblock the Notifications