కుమార్తె షర్మిల బాటలోనే.. మహిళా పోలీస్ కానిస్టేబుల్ చెంపపై కొట్టిన వైఎస్ విజయమ్మ
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిట్ కార్యాలయానికి వెళ్లడానికి బయలుదేరిన వైయస్ షర్మిలను పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ షర్మిల ఒక మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో పాటు, ఎస్సై పైన దురుసుగా ప్రవర్తించారు.
దీంతో పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేసి, ఆమెను బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కూతురు షర్మిల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన విజయమ్మ కూడా షర్మిల బాటలోనే కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. వైయస్ షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఆగ్రహించిన వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు.

పోలీసులు విజయమ్మను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులను నెట్టుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసిన వైయస్ విజయమ్మ ఈ క్రమంలో మహిళా పోలీస్ పై చేయి చేసుకున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని తోసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవడంతో ఆమె ఎదురుగా ఉన్న మహిళా పోలీసు చెంపపై కొట్టారు.
చివరకు పోలీసులు విజయమ్మను లోపలికి వెళ్లనివ్వకపోవడంతో కార్లోనే కూర్చొని ఆందోళన వ్యక్తం చేసిన వైయస్ విజయమ్మ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల ను అరెస్ట్ చేయడం పైన, వైయస్ విజయమ్మను అడ్డుకోవడం పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీస్ పై చెయ్యి చేసుకున్న వైఎస్ విజయమ్మ ..!!#YSVijayamma #YSSharmila #TelanganaPolice #TSPolitics #YSRTP #Oneindiatelugu pic.twitter.com/CA4NcO9Ndy
— oneindiatelugu (@oneindiatelugu) April 24, 2023
పోలీసులు దురుసుగా ప్రవర్తించడం వల్లే, ఆత్మరక్షణలో భాగంగా వైయస్ షర్మిల, వైయస్ విజయమ్మ చెయ్యి చేసుకున్నారని వారు చెబుతున్నారు. మరి పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు వైయస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు, వైయస్ విజయమ్మ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications