వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీమిండియా అభిమానులకు మరో బ్యాడ్‌ న్యూస్: కోహ్లీ స్థానాన్ని ఆక్రమించిన పాక్ ఓపెనర్

|
Google Oneindia TeluguNews

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇంకా బోణీ చేయలేదు. గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. ఈ ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనుంది. రెండు జట్లకూ గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. ఆడిన తొలి మ్యాచుల్లో పాకిస్తాన్‌ చేతిలోనే పరాజయాన్ని చవి చూశాయి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోతే- టోర్నమెంట్‌లో ముందుకు సాగే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నట్టవుతుంది.

కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

కోహ్లీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..

ఈ పరిస్థితుల మధ్య టీమిండియాకు మరో చేదు వార్త అందింది. ప్రత్యేకించి- కేప్టెన్ విరాట్ కోహ్లీ, డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అభిమానులకు ఒకింత ఆందోళనకు గురి చేసేదే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో.. ఈ ఇద్దరి స్థానాలు దిగజారాయి. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ మొదలు కావడానికి ముందు విరాట్ కోహ్లీ ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్‌లల్లో నాలుగో స్థానంలో ఉండేవాడు. ఇప్పుడు తన అతని స్థానం దిగజారింది. అయిదుకు పడిపోయాడు.

ఆఫ్ సెంచరీ సాధించినా..

ఆఫ్ సెంచరీ సాధించినా..

పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్ధసెంచరీతో రాణించినప్పటికీ- తన ర్యాంక్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ.. 49 బంతుల్లో 57 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ ర్యాంక్ మరింత పతనమైంది. అతను ఎనిమిదో స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్‌తో తలపడిన మ్యాచ్‌లో అతను తన సత్తా చాటలేకపోయిన విషయం తెలిసిందే. మూడు పరుగులకే వెనుదిరిగాడు.

అదరగొట్టిన మార్క్‌రమ్, రిజ్వాన్..

అదరగొట్టిన మార్క్‌రమ్, రిజ్వాన్..

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఎయిడెన్ మార్క్‌రమ్, పాకిస్తానీ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. టీ20 ఇంటర్నేషనల్స్‌ ర్యాంకింగుల్లో దూసుకెళ్లారు. కేరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్‌ను సాధించారు. వారిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మార్క్‌రమ్ 40 పరుగులు చేశాడు. వెస్టిండీస్‌పై హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-3లోకి దూసుకొచ్చేశాడు. మూడో స్థానంలో నిలిచాడు. అతని కంటే ముందు ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్, పాకిస్తాన్ కేప్టెన్ కమ్ ఓపెనర్ బాబర్ ఆజమ్ మాత్రమే ఉన్నారు.

టాప్-3లోకి..

టాప్-3లోకి..

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు మార్క్‌రమ్ ర్యాంక్ తొమ్మిది. కాగా- రెండు మ్యాచుల్లో నిలకడగా రాణించడంతో ఏకంగా అయిదు స్థానాలను మెరుగుపర్చుకోగలిగాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 40 వరకు ఉంటోంది. స్ట్రైక్ రేట్ 147.29. పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్.. నాలుగో స్థానంలోకి దూసుకొచ్చాడు. ఇది అతని కేరీర్ బెస్ట్ ర్యాంక్. ఇంతకుముందు- అతని ర్యాంక్ ఆరు. టీ20 ప్రపంచకప్‌లో నిలకడగా రాణించడంతో ర్యాంక్ మెరుగు పడింది. ఆరు నుంచి నాలుగుకు చేరుకున్నాడు.

 కోహ్లీ ర్యాంక్‌లో రిజ్వాన్..

కోహ్లీ ర్యాంక్‌లో రిజ్వాన్..

టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లల్లో 112 పరుగులు చేశాడు. టీమిండియాపై జరిగిన మ్యాచ్‌లో 79 నాటౌట్, బ్లాక్ క్యాప్స్‌పై 33 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ స్థానాన్ని ఆక్రమించాడు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. 12వ స్థానం నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు ఎగబాకాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ మహ్మద్ నయీం 11, నమీబియా కేప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ తమ ర్యాంకులను మెరుగుపర్చుకోగలిగారు.

బ్యాటర్ల ర్యాంకింగ్స్ ఇవే..

బ్యాటర్ల ర్యాంకింగ్స్ ఇవే..

మొత్తంగా ఐసీసీ ప్రకటించిన టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్‌లో టాప్-10లో వరుసగా డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్), బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), ఎయిడెన్ మార్క్‌రమ్ (దక్షిణాఫ్రికా), మహ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్), విరాట్ కోహ్లీ (భారత్), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా), డెవాన్ కోన్వే (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (భారత్), ఎవిన్ లెవిస్ (వెస్టిండీస్), హజ్రతుల్లా (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు.

బౌలర్లలో..

బౌలర్లలో..

బౌలర్లలో తబ్రేజ్ శాంసీ (దక్షిణాఫ్రికా), వనిందు డిసిల్వా (శ్రీలంక), రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్), ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్), ముజీబుర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్), ఆడమ్ జంపా (ఆస్ట్రేలియా), యాష్టన్ అగర్ (ఆస్ట్రేలియా), షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మెహదీ హసన్ (బంగ్లాదేశ్), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్) ఉన్నారు.

English summary
India skipper Virat Kohli has dropped down to the fifth spot while KL Rahul has also slipped to the eighth position in the rankings,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X