India 75: ఆత్మనిర్భర్ భారత్‌కు అసలు సిసలు నిర్వచనం ఇదే..!!
న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఏడాది కాలంగా ఈ వేడుకలు దేశవ్యాప్తంగా వేర్వేరు సందర్భాల్లో ఘనంగా కొనసాగుతూ వస్తోన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టున ముగింపు వేడుకలను అంతే వైభవంగా నిర్వహించడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోంది.
ఈ 75 సంవత్సాల్లో భారత్ అనేక మైలురాళ్లను నెలకొల్పింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. అన్ని రంగాల్లోనూ తనకు తిరుగులేదనిపించుకుంది. వ్యవసాయం మొదలుకుని అంతరిక్ష పరిశోధనల వరకు భారత్ ఆధిపత్యం కొనసాగింది. శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్య శాస్త్రంలో చిరస్మరణీయమై విజయాలను అందుకుంది. పరిశోధన-అభివృద్ధిలో ఎవరూ ఊహించని విధంగా భారత్ కొత్త పుంతలు తొక్కింది.
దీనికి నిదర్శనమే.. కరోనా వ్యాక్సిన్. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ స్వయంగా కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. బయటి దేశాలకు దాన్ని ఎగుమతి చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను పుణేలో గల సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. దాన్నీ పొరుగు దేశాలకు పంపించేంతటి సమృద్ధిని సాధించింది.

ఈ రెండే కాదు- హైదరాబాద్‌కే చెందిన మరో ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కోర్బెవ్యాక్స్, గుజరాత్‌కు చెందిన జైడుస్ క్యాడిలా డెవలప్ చేసిన జైకోవ్‌డీ, కోవవ్యాక్స్.. ఇవన్నీ స్వదేశంలో అభివృద్ధి చెందినవే. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం ఈ 75 సంవత్సరాల్లో భారత్ అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధిని సాధించిందనడానికి తాజాగా ఉదాహరణ- ఈ కోవిడ్ వ్యాక్సిన్ డెవలప్‌మెంట్.
వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని సకాలంలో దేశ ప్రజలకు అందజేయడం మరో ఎత్తు. దీన్ని కూడా అవలీలగా అధిగమించింది భారత్. 130 కోట్లకు పైగా ఉన్న దేశ జనాభాకు ఒక్కొక్కరికి రెండు చొప్పున కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అతి తక్కువ కాలంలో అందజేయగలిగింది. ఇప్పుడు తాజాగా బూస్టర్ డోసులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇన్ని కోట్ల డోసులను దేశ ప్రజలకు ఉచితంగా అందజేయడం కూడా ఓ ఘనతే.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications