వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ట రద్దు ఎఫెక్ట్: 1.5 మిలియన్ ఉద్యోగాల్లో కోత

ఏడాది క్రితం పెద్ద నగదు నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు మందగించాయి.ఈ మేరకు పలు సర్వే నివేదికలు వెల్లడించాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏడాది క్రితం పెద్ద నగదు నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం కారణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు మందగించాయి.ఈ మేరకు పలు సర్వే నివేదికలు వెల్లడించాయి.

నల్లధనం నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 8వ, తేదిన నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది.

నోట్ల రద్దు ఎఫెక్ట్: బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లునోట్ల రద్దు ఎఫెక్ట్: బ్యాంకుల్లో భారీగా పెరిగిన డిపాజిట్లు

అయితే పెద్ద నగదు నోట్ల రద్దు చేసింది. అయితే ఆర్‌బిఐ కొత్తగా రూ.2 వేల నోటును కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి కొనసాగింపుగానే రూ. 500 కొత్త నోటును విడుదల చేసింది. అయితే పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా ఉద్యోగాలపై ప్రభావం కన్పించింది.

పెద్ద నగదు నోట్ల రద్దుతో ఉద్యోగాలపై ప్రభావం

పెద్ద నగదు నోట్ల రద్దుతో ఉద్యోగాలపై ప్రభావం

సరిగ్గా ఏడాది కిందట పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో దాని ప్రభావం ఉద్యోగాలపై కన్పిస్తోంది. ప్రభుత్వం ముందు వసూలు కానీ రుణాలు, నిరుద్యోగం ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నాయి. దేశంలో పెరుగుతున్న శ్రామిక శక్తికి విలోమానుపాతంగా ఉపాధి మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనాల ప్రకారం 2017 జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఉద్యోగ, ఉపాధి మార్గాలు మందగించాయి.

 రోజువారీ కూలీలు, ఉద్యోగులపై ప్రభావం

రోజువారీ కూలీలు, ఉద్యోగులపై ప్రభావం

లేబర్‌ బ్యూరో ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ సర్వే ప్రకారం పెద్ద నోట్ల రద్దు ప్రబావం రోజువారీ కూలీలు, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. సంస్థల్లో ఉద్యోగస్తుల తగ్గింపు క్రమంగా కొనసాగుతూనే ఉందని ఈ సర్వే రిపోర్ట్‌లు వెల్లడిస్తున్నాయి. 2017 జనవరి-ఏప్రిల్‌ మధ్య కాలంలో సీఎంఐఈ వర్గాలు దేశవ్యాప్తంగా 5,19,285 మందిపై సర్వే నిర్వహించింది. ఈ సమయంలో మూడింటరెండొంతుల మంది నిరుద్యోగులుగా మారిపోయారని ఆ నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య కాలంలో మొత్తంగా 1.5 మిలియన్‌ ఉద్యోగాలు ఊడిపోయాయి.

 పీఎంకెవీవై కింద 2.9 లక్షల మందికి ఉద్యోగాలు

పీఎంకెవీవై కింద 2.9 లక్షల మందికి ఉద్యోగాలు

ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) స్కీమ్‌ కింద 2017 జులై మొదటి వారంలో 30. 67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. ఇతర సర్వేల ప్రకారం పెద్ద నోట్లరద్దు తరువాత సుమారు 107 సంస్థలు 14,668 మంది ఉద్యోగులను తొలగించాయి.

46 వేల పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో కోత

46 వేల పార్ట్‌టైమ్ ఉద్యోగాల్లో కోత

దేశంలో భారీ సంస్థలుగా నిలిచిన ఎల్‌ అండ్‌ టీ 1888, హిందుస్తాన్‌ యూనిలీవర్‌ 1453, ఐడియా సెల్యులార్‌ 707 ఏసీసీ 535, టాటా మోటార్స్‌ 534,టాటా స్టీల్‌ 450, హిందాల్కో 439, టైటాన్‌ ఇండస్ట్రీస్‌ 422మంది ఉద్యోగులను తొలగించారు. లేబర్‌ బ్యూరో క్వార్టర్లీ ఎంప్లాయిమెంట్‌ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్‌ - డిసెంబర్‌ మధ్య కాలంలో 1.52 లక్షల క్యాజువల్‌ ఉద్యోగాలు, 46 వేల పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల్లో కోత పడిందిని సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి.

English summary
About 1.5 million jobs were lost during January-April 2017. The estimated total employment during the period was 405 million compared to 406.5 million during the preceding four months, September-December 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X