మరోసారి కరోనా టెన్షన్ - పెరుగుతున్న కేసులు : ప్రభుత్వం అలర్ట్..!!

దేశ వ్యాప్తంగా కరోనా మరోసారి కలకలం రేపుతోంది. కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 1,800 కి పైనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆరు మరణాలు చోటు చేసుకున్నాయి. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని చెబుతున్నారు. కరోనా కేసులు ఐదు నెలల గరిష్టానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

మరో సారి కరోనా కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే 1,890 కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే, నిన్నటితో పోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో 56,551 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,805 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,05,952కి చేరింది.

దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందగా.. కేరళలో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,837గా నమోదైంది. పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

1,800 new Covid cases for second consecutive day, Union health ministry alerts the States

ఇదే సమయంలో కేంద్ర ఆరోగ్య శాళఖ అన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహిస్తొంది. గతం వారం కరోనా వ్యాప్తి పైన సమీక్ష చేసిన ప్రధాని మోదీ కీలక సూచనలు చేసారు. వాటిని అమలు చేసే క్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ కట్టడితో పాటుగా పరీక్షల నిర్వహణ పెంచాలని సూచించింది. వ్యాక్సినేషన్‌పై పైనా దిశా నిర్దేశం చేస్తోంది. ఆరు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువ గా ఉన్నట్లు గుర్తించారు.

గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా కేసులు నమోదు అవుతున్నట్లు వెల్లడించారు. ఆసుపత్రుల్లో సన్నద్ధతను పరిశీలించేందుకు ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మాక్‌డ్రిల్‌లో అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాలను పాల్గొంటాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+