1 కోటి మంది వైద్యారోగ్య సిబ్బందికి ఫస్ట్: వారికి తర్వాత పోలీసు, భద్రతా బలగాలకు వ్యాక్సిన్
కరోనా వైరస్ టీకా త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ రావడంతో ఎవరికీ తొలుత ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టంచేయగా.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ/ ప్రైవేట్ విభాగాల్లోని వైద్యారోగ్య సిబ్బందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఇప్పటికే 2 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ను గుర్తించారు. అయితే అందులో కోటి మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తారు.
వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించారు. కోటి మందిలో వైద్యులు, నర్సులు ఉంటారని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. తర్వాత పోలీసులు, భద్రతా దళాలు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాని మోడీ వర్చువల్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ కోసం టీకా గురించి చర్చించి.. నిర్ణయం తీసుకుంటున్నారు. ఇటీవల ఫార్మా కంపెనీలను ప్రధాని మోడీ సందర్శించిన సంగతి తెలిసిందే. తర్వాత మూడు కంపెనీలతో వర్చువల్ విధానంలో కూడా మీట్ అయ్యారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications