నేపాల్ పోలీసుల దాష్టీకం: సరిహద్దు వద్ద కాల్పులు, ఒక భారతీయుడు మృతి, ఇద్దరికీ గాయాలు...
అంతర్జాతీయ సరిహద్దు విషయంపై డ్రాగన్ చైనా కయ్యానికి కాలు దువ్వుతుండగా.. పనిలో పనిగా నేపాల్ కూడా గొడవకు సిద్ధమంటోంది. భారత్‌తో సరిహద్దుపై పార్లమెంట్‌లో కొత్త మ్యాప్ ప్రవేశపెట్టబోతోంది. శుక్రవారం సరిహద్దు ప్రజలపై కాల్పులకు తెగబడింది. నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక భారతీయుడు మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఇండియా-నేపాల్ సరిహద్దులో గల బీహర్ సీతమర్హి వద్ద శుక్రవారం కాల్పులు జరిగాయి. సోనేబర్ష పోలీసు స్టేషన్ పరిధిలో గల లాల్ బండీ జన్కీ నగర్ సరిహద్దు వద్దకు కొందరు స్థానికులు చేరుకున్నారు. అయితే నేపాల్ పోలీసులు కాల్పులు జరపడంతో ఒకరు చనిపోగా, ఇద్దరు గాయపడ్డారని సశస్త్ర సీమబల్ పాట్నా ఐజీ సంజయ్ కుమార్ తెలిపారు. సరిహద్దు వరకు స్థానికులు చేరుకోగా.. నేపాల్‌కు చెందిన ఆర్మ్ డ్ పోలీసు ఫోర్స్ కాల్పులు జరిపిందని తెలిపారు.

Recommended Video
అంతర్జాతీయ సరిహద్దు వద్దకు స్థానికులు చేరుకోవడంతో గొడవ మొదలైంది. అయితే నేపాల్ పోలీసులు మాత్రం తమ ఆయుధాలను లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. అందుకోసమే కాల్పులు జరిపామని చెబుతోంది. కానీ దీనిని స్థానికులు, భారత పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. కరోనా వైరస్ విజృంభించడంతో మార్చి 22వ తేదీన నేపాల్ అంతర్జాతీయ సరిహద్దును మూసివేసిన సంగతి తెలిసిందే.
Bihar: One dead, two injured in firing in Sitamarhi near India-Nepal border, confirms Sashastra Seema Bal IG of Bihar sector. Locals allege it was caused due to firing from Nepal side. pic.twitter.com/zr5YaJN9YE
— ANI (@ANI) June 12, 2020












Click it and Unblock the Notifications