హోటల్లో చెలరేగిన మంటలు: 10 సజీవదహనం
లక్నో: హోటల్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి 10 మంది సజీవదహనం అయిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. అలహాబాద్‌లోని ప్రతాప్ గడ్ లోని బాబాగంజ్ ప్రాంతంలో శుక్రవారం వేకువ జామున ఈ దుర్ఘటన జరిగింది. లక్నోకు 170 కిలోమీటర్ల దూరంలో ప్రతాప్ గడ్ ఉంది.
బాబాగంజ్ ప్రాంతంలో గోయెల్ హోటల్ ఉంది. గురువారం రాత్రి హోటల్ లో బస చేసినవారు ఎవరి గదులలో వారు నిద్రపోయారు. శుక్రవారం వేకువ జామున 4.30 గంటల ప్రాంతంలో హోటల్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.
ఒక్క సారిగా హోటల్ మొత్తం మంటలు వ్యాపించడంతో ఎవ్వరు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. నిద్రపోతున్న వారు నిద్రలోనే ఇద్దరు మహిళలతో సహ 10 మంది సజీవదహనం అయ్యారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అనేక మందికి తీవ్రగాయాలైనాయని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ అన్నారు.

గాయాలైన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వారిలో 7గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అలహాబాద్ తరలించామని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్కూట్ వలన మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ బలికరణ్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే పోలీసులు హోటల్ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications