వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: స్వీట్లు ఆశగా చూపి.. పదేళ్ల బాలికపై.. మూడు నెలలుగా.. గ్యాంగ్ రేప్

అయిదో తరగతి చదువుతున్న ఆ బాలిక(10)పై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (60), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34),

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

భోపాల్: భోపాల్ నగరం నడిబొడ్డున ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఉదంతం మరవక ముందే అదే నగరంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికకు స్వీట్లు ఆశగా చూపి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

నలుగురు వ్యక్తులు మూడు నెలలుగా అనేకమార్లు ఆ బాలికపై అత్యాచారం జరపడమేకాక.. ఆ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ వరుస అత్యాచార ఘటనలతో భోపాల్‌ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

10-yr-old girl repeatedly gang-raped over 3 months; 3 arrested

వివరాల్లోకి వెళితే... అయిదో తరగతి చదువుతున్న ఆ బాలిక(10)పై.. వాచ్‌మన్‌గా పని చేస్తూ అదే కాలనీలో నివాసం ఉంటున్న నన్హూలాల్‌ (60), మరో ముగ్గురు వ్యక్తులు గోకుల్‌ పన్వాల్‌ (42), గ్యానేంద్ర పండిట్‌ (34), సుమన్‌పాండే (49) గత 3 నెలలుగా అఘాయిత్యానికి ఒడిగట్టారు.

చివరిసారిగా ఆ బాలికపై నిందితులు నవంబర్‌ 12న అత్యాచారానికి ఒడిగట్టారు. బాలిక ప్రవర్తనలో తేడా గమనించిన ఆమె తల్లి ఆరాతీయగా అసలు విషయం తెలిసింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ బాలిక ఇంటి పక్కనే ఉండే సుమన్‌ పాండే స్వీట్లను ఆశగా చూపి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అంగీకరించాడు. దీంతో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

English summary
A 10-year-old girl was allegedly raped by three men, including a 65-year-old watchman, repeatedly over three months following which the accused were arrested. The three were arrested on Friday and were sent to judicial custody. They were identified as Gokul Panwala (45), Gyanendra Pandit (36) and Nanhu Lal (65). The accused were also thrashed by angry locals when they were taken to their houses to gather evidence as part of police investigation, Jehangirabad Police Station Inspector Preetam Singh Thakur told
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X