వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిగ్గింగ్ అడ్డుకున్నాడని నాలుక కత్తిరించారు, ఎఫ్ఐఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో/పాట్నా: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రిగ్గింగ్‌ను అడ్డుకున్నందుకు ఓ పోలింగ్ ఏజెంట్ నాలుకను కత్తిరంచారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో జరిగింది. ఇందుకు సంబంధించి 11 మంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు సోమవారం నాడు వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్ సమయంలో ఇది జరిగిందని తెలిపారు.

శుక్రవారం నాడు తొలి దఫా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే, రమాకాంత్, అతని తనయుడులు రాణిగంజ్‌లోని ప్రజాపతి పోలింగ్ బూత్‌లోని ఏజెంట్ నాలుకను కత్తిరించారు. అతను రిగ్గింగ్ అడ్డుకున్నందునే ఇలా చేశారు. దీంతో, ఫిర్యాదు అందడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రమాకాంత్, అతని తనయుడులు దినకర్, దుర్గేష్, వినోద్, ఆదర్శ్, మరో వ్యక్తి బబ్లూ, మరో ఐదుగురి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

11 booked for cutting off poling agent's tongue in UP

ముగిసిన బీహార్ తొలిదశ పోలింగ్

బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సోమవారం ముగిసింది. పది జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.

కొన్నిచోట్ల నిర్ణీత సమయంలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో ఆయా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యమైంది. సాయంకాలం నాలుగు గంటల సమయానికి 52.12 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తిస్థాయిలో ఎంత పోలింగ్ నమోదైందన్న వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. తొలి దశ పోలింగ్ 57 శాతం.

English summary
An FIR has been registered against 11 persons, including a former block head and his sons, for chopping off tongue of an election agent during first phase of Panchayat polls, police said here on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X