ఉత్తరాఖండ్‌లో ప్రమాదం, ఇద్దరు మహిళలు సహా 12 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జోషిమఠ్ బ్లాక్‌లో గల ఉర్గాం- పల్లా జఖోలా మోటార్ వేపై వాహనం ప్రమాదానికి గురయ్యింది. యాక్సిడెంట్‌లో 12 మంది చనిపోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. 10 మంది పురుషులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి జిల్లా కలెక్టర్ హిమాన్హు ఖురానా, ఎస్పీ ప్రేమేంద్ర దోవల్ చేరుకున్నారు. అక్కడికి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికారులు కూడా వచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంతో అక్కడ భీతవాహ వాతావరణం నెలకొంది. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మిన్నంటింది.













Click it and Unblock the Notifications