నేపాల్లో 12మంది భారతీయులు మృతి, బీహార్లో తుఫాన్ బీభత్సం: 30 మంది మృతి
ఖాట్మాండు: నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో పన్నెండుమంది భారతీయ యాత్రికులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 27 మంది గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మాండుకు 75 కిలోమీటర్ల దూరంలో, దాడింగ్ జిల్లాలోని నౌబిష్ గ్రామం వద్ద వాహనం వంద మీటర్ల లోతులో పడిపోయింది.
దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకుల్లో పన్నెండు మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. ఈ బస్సులో గుజరాత్ రాష్ట్రానికి చెందిన 45 మంది పర్యాటకులు ఉన్నారు. వీరు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం చూసిన తర్వాత తిరిగి గోరక్ పూర్ తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో ఘటన జరిగింది.

సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం జరిగింది త్రిభవన్ హైవే అని చెప్పారు. స్థానిక ప్రజలు, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేస్తున్నామని అధికారులు చెప్పారు. గాయపడ్డ పర్యాటకులను ఖాట్మాండు మెడికల్ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
ఢిల్లీలో కుప్పకూలిన మూడంతస్థుల భవనం
ఢిల్లీలోని మోతీనగర్ సుదర్సన్ పార్కులో మూడంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులున్నారు. భవన శిథిలాల కింద మరికొంతమంది ఉంటారని భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన బుధవారం ఉదయం ఏడు గంటలన నలభై అయిదు నిమిషాలకు చోటు చేసుకుంది.
బీహార్‌లో ఇసుక తుఫాను బీభత్సం: 32 మంది మృతి
బీహార్‌లోని కోసిలో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. పెను తుఫాను ధాటికి 32 మందిదాకా మృతి చెందినట్లు తెలుస్తోంది. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు.












Click it and Unblock the Notifications