వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఢిల్లీ తబ్లీగి జమాత్ దెబ్బకు 13 మంది విద్యార్థులకు కరోనా, క్వారంటైన్ లో 50 మంది !

|
Google Oneindia TeluguNews

లక్నో/ కాన్పూర్: దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాల దెబ్బకు దేశం మొత్తం హడలిపోయింది. తబ్లీగి జమాత్ సభ్యుల కారణంగా దేశంలోని వివిద ప్రాంతాల వారికి కరోనా వైరస్ (COVID 19) వ్యాపించిందని ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట బయటపడుతోంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని ఓ మదరసాలో ఏకంగా 13 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు హడలిపోయారు. కాన్పూర్ లోని మదరసాలో ఉంటున్న విద్యార్థులు తబ్లీగి జమాత్ సభ్యులతో సంబంధాలు కొనసాగించారని ఉత్దరప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అశోక్ శుక్లా అంటున్నారు. మరో 50 మంది విద్యార్థులను కరోనా క్వారంటైన్ కు తరలించారు.

విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !విద్యార్థిని ప్రేమించాడు, ప్రియురాలిని పంచేశాడు, 10 మంది లైంగిక దాడి, తల్లిని చేసి, కరోనా భయంతో !

 మదరసాలో విద్యార్థులకు అనారోగ్యం

మదరసాలో విద్యార్థులకు అనారోగ్యం

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని ఓ మదరసాలో చాలా మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ మదరసాలో ఉంటున్న విద్యార్థుల్లో కొందరు అనారోగ్యానికి గురైనారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వెంటనే వైద్య సిబ్బందిని తీసుకెళ్లి మదరసాలో ఉంటున్న 50 మంది వైద్య పరీక్షలు చేయించారు.

 13 మందికి కరోనా పాజిటివ్

13 మందికి కరోనా పాజిటివ్

మదరసాలో ఉంటున్న 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ల్యాబ్ కు పంపించారు. మదరసాలో ఉంటున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో స్థానిక వైద్య శాఖ, కార్పోరేషన్ అధికారులు హడలిపోయారు. వెంటనే మదరసా ఉంటున్న పరిసర ప్రాంతాలను సీల్ డౌన్ చేశారు.

 తబ్లీగి జమాత్ ఎఫెక్ట్

తబ్లీగి జమాత్ ఎఫెక్ట్

ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లీగి జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారితో మదరసాలో ఉంటున్న విద్యార్థులు సన్నిహితంగా ఉంటున్నారని, వారి వలనే 13 మందికి కరోనా వైరస్ వచ్చిందని కాన్పూర్ వైద్యశాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఢిల్లీ తబ్లీగి జమాత్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారు ఎలాంటి వైద్యపరీక్షలు చేయించుకోకుండా నేరుగా మదరసాకు రావడం, అక్కడి విద్యార్థులతో సన్నిహితంగా ఉండటం వలనే వారికి కరోనా వైరస్ సోకిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

 మదరసా క్వారంటైన్

మదరసా క్వారంటైన్

కరోనా వైరస్ సోకిన 13 మంది విద్యార్థులు కరోనా ఐసోలేషన్ వార్డులకు తరలించారు. మిగిలిన విద్యార్థులను మదరసాలోనే క్వారంటైన్ లో పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా మదరసాలో ఉంటున్న విద్యార్థులు అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి ఆ నమూనాలకు ల్యాబ్ కు పంపించామని వైద్యులు, కన్పూర్ కార్పోరేషన్ అధికారులు అంటున్నారు.

 చెప్పిన మాట వినకుండా నిర్లక్షం చేస్తే !

చెప్పిన మాట వినకుండా నిర్లక్షం చేస్తే !

ఢిల్లీలోని తబ్లీగి జమాత్ సమావేశాలకు వెళ్లిన వారు వెంటనే స్వచ్చందంగా ముందుకు వచ్చి వైద్యపరీక్షలు నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం పదేపదే అందరికీ మనవి చేసింది. అయినా తబ్లీగి జమాత్ సమావేశాకు వెళ్లిన వారు పలు ప్రాంతాలకు వెళ్లిపోయి ఎలాంటి వైద్యపరీక్షలు చేసుకోకుండా నిర్లక్షం చెయ్యడం వలనే ఇలా ఒకరి నుంచి ఒకరికి, వారి నుంచి మరి కొంత మందికి కరోనా వైరస్ వ్యాపిస్తోందని అధికారులు అంటున్నారు. మొత్తం మీద తబ్లీగి జమాత్ సమావేశాలకు వెళ్లిన వారి నుంచి 13 మంది విద్యార్థులకు కరోనా వచ్చిందని వెలుగు చూడటంతో పలు ప్రాంతాల్లోని మదరసాల్లో ఉంటున్న విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.

Recommended Video

Coronavirus Lockdown : Home Ministry Allows Reopening Of All Shops, Coditions Apply!

English summary
Coronavirus: 13 Students tested coronavirus positive after contact with Delhi Tablighi Jamaat members in Kanpur in Uttar Pradesh. now, kanpur total COVID19 cases rise to 107.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X