13 ఏళ్ల బాలికను ముగ్గురు ఎత్తుకెళ్లి, గ్యాంగ్ రేప్: ఓడిశాలో...
ముజఫర్ నగర్/ఒడిశా: పదమూడేళ్ల బాలికను ముగ్గురు యువకులు అపహరించి, అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్‌లో చోటు చేసుకుంది. ముగ్గురు యువకులు ఆమె పైన భగవాన్‌పురలో వారు ఈ దాష్టీకానికి పాల్పడినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
గులాబ్, గ్యూర్, లాల్ అనే ముగ్గురు యువకులు బాధిత యువతి ఇంటికి దగ్గరలో ఉంటారు. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన ఆమెను ఎత్తుకెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది సిఖేరా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది.

తన కూతురు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికీ దాదాపు స్పృహ కోల్పోయినట్లుగా ఉందని తల్లి చెప్పారు. పోలీసులు శనివారం నాడు సాయంత్రం నిందితుల పైన కేసు నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
బాలికపై రేప్ చేసిన యువకుడి అరెస్ట్
22 ఏళ్ల యువకుడిని ఒడిశా రాష్ట్రంలోని గంజామ్ జిల్లాకు చెందిన బాంజానగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇతని వయస్సు 22 ఏళ్లు. నాలుగేళ్ల బాలిక పైన ముజాగర్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణల పైన అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
బాధితురాలి, నిందితుడు పక్క పక్కన ఉండే ఇళ్లవారు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఉద్యోగం లేని ఇతను నిత్యం తన ఇంటిలో ఆడుకునేందుకు బాలికలను ఏదైనా చూపించి రప్పించుకునేవాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications