coronavirus:ఇప్పుడు ఢిల్లీలో.. 14మంది వైద్యసిబ్బందికి వైరస్, క్వారంటైన్‌లో డాక్టర్లు
కరోనా వైరస్ సోకిన రోగులకు అందిస్తోన్న వైద్య సిబ్బందికి కూడా వ్యాధి సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 54 మంది వైద్య సిబ్బందికి వైరస్ సోకిందని విషయం మరవకముందే... దేశ రాజధానిలో కూడా మరికొందరికీ వచ్చిందని తెలిసింది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జహంగిరిపురిలో వైద్యసిబ్బందికి వ్యాధి అంటుకుంది.
ఢిల్లీ జహంగిరిపురి ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు వైద్య సేవలు అందిస్తోన్న దాదాపు 14 మంది డాక్టర్లు, నర్సులకు వ్యాధి సోకింది. వైద్య సిబ్బందికి వైరస్ సోకిందనే విషయం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పంజాబ్‌లోని ఫాగ్వారాకు చెందిన 6 నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నెల 9వ తేదీన చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిడియాట్రిక్ సెంటర్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. వెంటిలేటర్‌పై ఉంచే క్రమంలో వైరస్ బయటపడింది. దీంతో వైద్యులు ఆందోళన చెందారు. డాక్టర్లు సహా 54 మంది క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన వారిసంఖ్య 2 వేల 376 మందికి చేరింది. గురువారం ఒక్కరోజే 128 మందికి పాజిటివ్ కేసులు నమోదవడం ప్రభుత్వ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మృతుల సంఖ్య 50కి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వైరస్ సోకిన వారి సంఖ్య 4 వేలకు చేరింది. గురువారం ఒక్కరోజే 478 మందికి వ్యాధి సోకిందని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 168 మంది చనిపోయారని పేర్కొన్నారు.
Recommended Video
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications