• search

వర్షాలు వరదల ధాటికి గత మూడునెలల్లో 1400 మృతి : కేంద్ర హోంశాఖ

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
   వర్షాలు వరదల ధాటికి గత మూడునెలల్లో 1400 మృతి : కేంద్ర హోంశాఖ

   ఢిల్లీ: ప్రకృతి ప్రకోపానికి భారతదేశం అల్లాడిపోయింది. దేవభూమి కేరళను వరదలు ఛిన్నాభిన్నం చేశాయి. ఆ ప్రకృతి ప్రసాదించిన అందాలను వరదలు తుడిచేశాయి. తిరిగి కేరళ మామూలు స్థితికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుందో ఇప్పుడప్పుడే చెప్పడం కష్టం. ఇక వరదలు సహజ అందాలను తుడిచేయడమే కాక... మానవజాతిపై కూడా కక్ష కట్టినట్లు కనిపిస్తుంది. కేరళతో పాటు దేశవ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలకు ఎంతో మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.

   ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు గత మూడు నెలల్లోనే 1400 మంది మృతి చెందినట్లు కేంద్ర హోంశాఖ అనుబంధ సంస్థ నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. 2015 సంవత్సరం మొత్తానికి గాను వర్షాలతో సంభవించిన మరణాల సంఖ్య 1480 ఉండగా.. 2016లో ఈ సంఖ్య 1420గా ఉంది. దీంతో గత కొన్నేళ్లు తీసుకుంటే ఈ ఏడాది జరిగి బీభత్సం గతంలో జరగలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మాత్రం అధికంగా మరణాలు ఒక్క కేరళ రాష్ట్రంలోనే సంభవించాయి.

   కేరళలో వరదల ధాటికి 488 మంది మృతి

   కేరళలో వరదల ధాటికి 488 మంది మృతి

   ఆగష్టు 8 నుంచి 28 మధ్య కేరళలో కురిసిన భారీవర్షాలతో అక్కడ వరదలు పోటెత్తాయి. మొత్తం 14 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ఈ జిల్లాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోగా కొన్ని లక్షల మంది ప్రజలు సహాయక శిబిరాల్లో బిక్కుబిక్కు మంటూ గడిపారు. అంతేకాదు వరదల ధాటికి రాష్ట్రంలో అపారమైన నష్టం సంభవించింది. మొత్తం రూ. 19వేల 500 కోట్లు నష్టం జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం పినరాయి విజయన్ ప్రకటించారు.

   ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో సంభవించిన వరదలకు 254 మంది మృతి చెందారు. సోమవారం రోజున ఉత్తర్ ప్రదేశ్‌లో 10 మంది మృతి చెందగా.. ఉత్తరాఖండ్‌లో కురిసిన భారీ వర్షాలకు 13 మంది మృతి చెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వర్షంతోనే కాక కొండచరియలు విరిగిపడటంతో కూడా కొంతమంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన మరణాలు ఎక్కువగా పిడుగు పడటంతోనే సంభవించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉత్తరాఖండ్ మరణాలు మాత్రం కొందరు ప్రయాణిస్తున్నకారుపై కొండచరియలు విరిగి పడటంతో అది లోయలోపడి సంభవించాయని అధికారులు వెల్లడించారు.

    మరో మూడు తుఫాన్లు వచ్చే అవకాశం:వాతావరణ శాఖ

   మరో మూడు తుఫాన్లు వచ్చే అవకాశం:వాతావరణ శాఖ

   ఇన్ని రోజులు కేరళను అతలా కుతలం చేసిన వర్షాలు ఇప్పుడు ఉత్తరభారతంపై కన్నెర్ర చేసే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర భారతంలోని హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాలు, మధ్య దక్షిణ ఉత్తర్ ప్రదేశ్‌, ఈశాన్య జార్ఖండ్‌లలో తుఫాను వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో రానున్న మూడురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్‌మెంట్ చెబుతోంది.

   మసూరిలోని కెంప్టీ ఫాల్స్‌ను వీక్షించేందుకు వచ్చిన 180 మంది పర్యాటకులను ఆప్రాంతం నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 40 అడుగుల ఎత్తైన కొండ నుంచి వర్షపు నీరు ప్రధాన రహదారిపైకి పడుతుండటంతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భావించిన అధికారులు టూరిస్టులను ఖాళీ చేయించారు.

   మరణాల సంఖ్యలో మూడో స్థానంలో బెంగాల్

   మరణాల సంఖ్యలో మూడో స్థానంలో బెంగాల్


   పశ్చిమ బెంగాల్‌లో కురిసిన భారీ వర్షాలకు 210 మంది మృతి చెందారు. ఈ ఏడాది వర్షాలకు మృతి చెందిన వారి సంఖ్యలో పశ్చిమ బెంగాల్ మూడోస్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో 170 మరణాలతో కర్నాటక నిలువగా... 100 మంది మృతుల సంఖ్యతో మహారాష్ట్ర ఐదో స్థానంలో నిలిచింది. మొత్తం మీద భారీ వర్షాలకు దేశవ్యాప్తంగా 43 మంది గల్లంతయ్యారు. కేరళలో 15 మంది, యూపీలో 14 మంది, వెస్ట్ బెంగాల్‌లో ఐదుమంది, ఉత్తరాఖండ్‌లో ఆరుమంది, కర్నాటకలో ముగ్గురు గల్లంతయ్యారు. మరోవైపు 386 మందికి వర్షాల వల్ల గాయాలపాలైనట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

   రాజ్యసభలో వరద నష్టంపై గణాంకాలు

   రాజ్యసభలో వరద నష్టంపై గణాంకాలు

   ఈశాన్య రాష్ట్రం అస్సోంలో వర్షాలు వరదల ధాటికి 11.47 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. 27,964 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. బెంగాల్‌లో 2.28 లక్షల మంది నష్టపోగా అక్కడ 48,552 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గణాంకాలు తెలిపాయి. రాజ్యసభలో జలవనరుల శాఖ ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారం... 1953 నుంచి 2017 వరకు భారీ వర్షాలు వరదల ధాటికి 1,07,487 మంది మృతి చెందినట్లు తెలిపింది. అంతేకాదు ఈ వర్షాల ధాటికి పంటనష్టం, గృహాలు, ప్రభుత్వ సంస్థలు ధ్వంసమై మొత్తం రూ. 3,65,860 కోట్ల మేరా నష్టం వాటిల్లినట్లు అంచనావేసింది.

   ఈ సమాచారం మొత్తం ఆయా రాష్ట్రాలు ఇచ్చిన గణాంకాల ప్రకారం సెంట్రల్ వాటర్ కమిషన్ సేకరించి రిపోర్ట్ తయారు చేసింది. 2013 నుంచి 2017 వరకు ఉన్న గణాంకాలు కేవలం అంచనా మాత్రమేనని కేంద్ర జలవనరుల శాఖ స్పష్టం చేసింది.

   తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

   English summary
   The Union home ministry’s National Emergency Response Centre said on Monday that 1400 people have died from rain and flood related causes since May 28, a number that is almost as high as the 1480 and the 1420 deaths due to such causes in all of 2015 and 2016, making this year’s monsoon one of the most destructive in recent years

   Oneindia బ్రేకింగ్ న్యూస్
   రోజంతా తాజా వార్తలను పొందండి

   Notification Settings X
   Time Settings
   Done
   Clear Notification X
   Do you want to clear all the notifications from your inbox?
   Settings X
   X
   We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more